KOIL ALWAR TIRUMANJANAM HELD AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 26 May 20: The traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam was held at Sri Govindaraja Swamy temple in Tirupati on Tuesday in connection with annual brahmotsavams which are set to commence with Dhwajarohanam on May 28.

The nine day festival will be observed from May 28 to June 5 with Ankurarpanam on May 27. In view of Covid 19 lockdown restrictions, the Vahana Sevas will be observed within the temple premises.

On Tuesday, the entire temple was cleansed with aromatic sacred Parimalam mixture which is applied to the roofs, walls of the temple and the puja utensils were also cleansed.

Archakas and temple staff took part.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుప‌తి, 26 మే 2020: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఆలయంలో మే 28 నుంచి జూన్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వహించారు. ఆ తరువాత కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధి, శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్‌ అమ్మవారు, శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ పుండరికవల్లీ ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చ‌కులు, సిబ్బంది పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.