KOIL ALWAR TIRUMANJANAM ON JULY 11_ జూలై 11న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
By TTD News On 10 Jul, 2017 At 03:02 PM | Categorized As Events, Press Releases

Tirumala, 10 Jul. 17: In connection with annual Anivara Asthanam on July 16, Koil Alwar Tirumanjanam will be performed in Tirumala temple on July 11. TTD has cancelled Astadala Pada Padmaradhana in view of this festival.

This temple cleansing fete with aromatic ingredients will commence at 6am and last for over four hours. A special mixture made of camphor, sandal paste, saffron, turmeric Kicchili Gadda (a root vegetable) etc. is smeared in the entire Garbha Griham, including floors, ceilings and walls, sub-shrines inside the sanctum, while the puja articles are cleaned with water.

The main deity will be covered with a white veil till the entire process of cleansing is completed. The covering on the main deity is then removed and the other articles are replaced inside. Special pujas and Naivedyams are then offered to the presiding deity.

This ceremony is performed strictly as per the agamas and is conducted four times year before Ugadi, Anivara Asthanam, Vaikunta Eakadasi and Annual Brahmotsavams.

Only the temple staffs take part in this cleansing fete. The pilgrims are allowed for darshan after12noon on wards on Tuesday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 11న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల, 2017 జూలై 10: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీన సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జూలై 11వ తేదీన మంగళవారంనాడు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని టిటిడి నిర్వహించనుంది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూెత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

జూలై 11న ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని అష్టదళ పాదపద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా జరుగుతాయి.

ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ యావత్‌ కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొంటారు. అనంతరం భక్తులను మధ్యాహ్నం 12.00 గంటల నుండి సర్వదర్శనానికి అనుమతిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am