KOIL ALWAR TIRUMANJANAM PERFORMED IN SRIVARI TEMPLE_ శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
By TTD News On 11 Dec, 2018 At 04:58 PM | Categorized As Temple News

Tirumala, 11 December 2018: In connection with Vaikuntha Ekadasi on Dec 18, Koil Alwar Tirumanajanm, the temple cleansing activity observed in Sri Tirumala Temple on Tuesday.

Significance: Koil Alwar means ‘Holy Shrine’. Tirumanjanam is cleansing.The main purpose of performing Koil Alwar Tirumanjanam is purification of sanctum sanctorum and temple premises.

Procedure: During the ceremony all the Murtis and other articles are removed from sanctum sanctorum and the mula murti is covered with water- proof covering. The entire Garbhalayam, including floors, ceilings and walls are then cleaned and brushed well with plenty of water. The whole place is then smeared with Vermilion, Turmeric, Camphor, Sandal paste, Saffron, Kichiligadda mixture which acts as disinfectant. The covering on the main deity is then removed and the deities, deepam and other articles are replaced inside. Purificatory pujas and Naivedyams are the offered to the deity and then pilgrims are allowed for darshan. This takes place between 6am to 10am in Tirumala temple.

When is this performed: This ceremony is performed strictly as per the tenets of Vaikhanasa Agama and is conducted four times in a year before Ugadi, Anivara Asthanam, Vaikunta Eakadasi and annual Brahmotsavams.

JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Haridhranath, Peishkar Sri Ramesh, VGO Sri Manohar and others took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

డిసెంబ‌రు 11, తిరుమల 2018: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీ‌నివాస‌రాజు మీడియాతో మాట్లాడుతూ డిసెంబరు 18వ తేదీన వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయ‌ని తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్‌, పేష్కార్ శ్రీ రమేష్‌బాబు, ఏఈవో శ్రీ‌ అశోక్‌, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ గంగ‌రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v