SRI KRT EVENTS IN JULY _ జూలైలో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు
By TTD News On 29 Jun, 2017 At 04:03 PM | Categorized As Events, Press Releases

Tirupati, 29 June 2017: The following are the list of events to be observed in Sri Kodanda Rama Swamy temple in Tirupati in the month of July.

July 1, 8, 15, 22, 29: Abhishekam to presiding deities on these Saturdays between 6am to 7am. Evening Tiruchi Vahanam
July 9: Astottara Satakalasabhishekam
July 19 to 21: Pavitrotsavams in the temple
July 23: Sahasrakalasabhishekam between 6am and 8am following Punarvasu Nakshatram and Hanumantha Vahana seva in the evening

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలైలో శ్రీకోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2017 జూన్ 29: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

– జూలై 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. రూ.20/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు శ్రీసీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్సేవ నిర్వహిస్తారు.

– జూలై 9వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. రూ.50/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు, ఆస్థానం నిర్వహిస్తారు.

– జూలై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.

– జూలై 23వ తేదీ అమావాస్య మరియు పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 6.00 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ సేవలో పాల్గొన్నవచ్చు. అనంతరం ఉదయం 11.00 గంటలకు శ్రీ సీతారామ కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్నవచ్చు. రాత్రి 7.00 గంటలకు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am