LANKAN PREZ OFFERS PRAYERS_ శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్య‌క్షుడు గౌ.. శ్రీ మైత్రిపాల సిరిసేన‌
By TTD News On 17 Apr, 2019 At 09:25 AM | Categorized As VIP News

Tirumala, 17 Apr. 19: The Sri Lankan President Sri Mitripala Sirisena offered prayers in the hill shrine of Lord Venkateswara in Tirumala along with his family and entourage on Wednesday.

The top brass foreign dignitary was accorded warm welcome by TTD EO Sri Anil Kumar Singhal and Tirumala JEO Sri KS Sreenivasa Raju on his arrival at Mahadwaram-the main entrance of the temple.

Later he offered prayers to the presiding deity of Lord Venkateswara in the sanctum sanctorum during the VIP break darshanam. The temple priests explained him about the significance of the deity and various embellishments adorned to the mula virat.

The Lankan Prez also offered prayers in the sub-shrines including Vakulamata temple, Bhashyakarulavari sannidhi, Yoganarasimha Swamy.

At Ranganayakula mandapam he was offered Vedadirvachanam by vedic pundits. Later TTD EO Sri Anil Kumar Singhal presented him the theerthaprasadams and laminated photo of Lord.

Srilankan Embassy Deputy High Commissioner Sri Krishnamurthy, protocol Additional Secretary Lt.Col.Ashok Babu, temple DyEO Sri Harindranath and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్య‌క్షుడు గౌ.. శ్రీ మైత్రిపాల సిరిసేన‌

ఏప్రిల్ 17, తిరుమ‌ల‌, 2019: శ్రీలంక అధ్యక్షుడు గౌ. శ్రీ మైత్రిపాల సిరిసేన కుటుంబ సభ్యులతో క‌లిసి బుధ‌వారం ఉదయం విఐపి బ్రేక్ లో శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ.. శ్రీ‌లంక అధ్య‌క్షునికి టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, అర్చకులు క‌లిసి ఆలయ మర్యాదలతో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి న‌మ‌స్క‌రించిన అనంత‌రం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ త‌రువాత శ్రీ‌ వకుళామాతను, శ్రీ విమాన వేంకటేశ్వరస్వామిని, శ్రీ భాష్య‌కార్ల‌ను, శ్రీ యోగ‌న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.

అనంత‌రం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీ కెఎస్‌.శ్రీనివాస‌రాజు క‌లిసి తీర్థ ప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని గౌ.. శ్రీలంక అధ్య‌క్షునికి అందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌లంక ఎంబ‌సి డెప్యూటీ హైక‌మిష‌న‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి, ప్రోటోకాల్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ అశోక్‌బాబు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవో శ్రీ బాలాజి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v