LIST OF FESTIVALS IN SRI GT IN JULY_ జూలైలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
By TTD News On 2 Jul, 2018 At 11:24 AM | Categorized As Events, Press Releases

Tirupati, 2 July 2018: The following are the list of festivals in the month of July in Sri Govinda Raja Swamy temple.

July 6,13,20: Procession of Sri Andal Ammavaru in mada streets

July 10: Procession of Sri Parthasaradhi Swamy along with Rukmini and Satyabhama on the advent of Rohini Nakshatra

July 17: Anivara Asthanam

July 18: Sri Govinda Raja swamy procession with Sridevi and Bhudevi on the advent of Uttara Nakshatra

July 21: Darshan of deities on Adi Swati Nakshatra

July 22 to 24: Jyestabhishekam

July 24: Procession of Lord on Garuda Vahanam by 6am on the occasion of Tulasi Mahatyam

July 27: Sampurna Chandra Grahanam

July 28: Procession of deities on the advent of Sravana Nakshatram

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలైలో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2018 జూలై 02: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలైలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– జూలై 6, 13, 20వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

– జూలై 10న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

– జూలై 17న ఆణివార ఆస్థానం జరుగనుంది.

– జూలై 18న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.

– జూలై 21న ఆడి స్వాతిరోజున స్వామివారు అహోబిల మఠానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను కటాక్షిస్తారు.

– జూలై 22 నుండి 24వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది.

– జూలై 24న తులసి మహత్యం ఉత్సవం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

– జూలై 27న చంద్రగ్రహణం.

– జూలై 28న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `