LORD MALAYAPPA ON HAMSA VAHANA IN SARASWATHI ALANKARAM _ హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

Tirumala, 17 October 2020: On the evening of the second day of the ongoing Srivari Navaratri Brahmotsavams on Saturday, Sri Malayappaswamy blessed devotees in Saraswati alankaram on the golden Hamsa Vahana.

Due to Covid restrictions, the Hamsa vahana was held at Kalyana Mandapam within Srivari temple in Ekantam.

According to legend Hamsa-the favourite ride of Goddess of Wisdom-Saraswathi is a symbol of nobility and virtues. Lord rode on Hamsa Vahana to bless his devotees with true wisdom and nobility.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, TTD EO Dr KS Jawahar Reddy, Parliament member Sri Vemireddy Prabhakar Reddy, Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar, Board members Sri DP Anant, Smt Prashanti Reddy, Sri Chippagiri Prasad, Sri Govind Hari, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Chief Priest Sri Venugopal Deekshitulu, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

హంస వాహనంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

తిరుమ‌ల‌, 2020 అక్టోబ‌రు 17: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7.00 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు హంస వాహనంపై వీణ ధ‌రించి స‌ర‌స్వ‌తి దేవి  అలంకారంలో దర్శనమిచ్చారు.

హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

కాగా, న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఆది‌‌వారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.