LORD RAMA RIDES AS VENUGANA_ వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి చిద్విలాసం
By TTD News On 14 Apr, 2019 At 03:03 PM | Categorized As Brahmotsavams

Vontimitta, 14 Apr. 19: In a spectacular and glittering vahanam on the day-2 of the ongoing Brahmotsavams of Sri Kodandarama Swamy temple at Vontimetta, Lord Rama spellbound devotees as he rode on mada streets in the Venugana alankaram.

Devotees in thousands braved the summer heat in this Historic town in Kadapa district to witness the celestial event and offered haratis to beget Lords darshan and blessings.

Later the utsava idols were offered the Agama ritual of snapana thirumanjanam in the afternoon and also grand unjal seva in the evening.

At night Lord Rama rode on Hamsa Vahanam signalling that he always blessed devotees who were honest and sincere in Bhakti path and devotion to him.

DyEO Sri Natesh Babu, AEO Sri Rama Raju other temple priests and large number of devotees participated in the celestial event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి చిద్విలాసం

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్‌ 14: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.

సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది.

హంస వాహనం :

శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సోహం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్‌బాబు, ఏఈవో శ్రీ రామరాజు, ఇతర అధికార ప్రముఖులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v