LORD RIDES ON GAJA VAHANAM_ గ‌జ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం
By TTD News On 16 May, 2019 At 09:46 PM | Categorized As Brahmotsavams

Tirupati, 16 May 19: On the pleasant evening on Thursday, Sri Govindaraja Swamy took out celestial ride on the mighty Gaja Vahanam.

Gaja, the elephant is a symbol of wealth, pride, majesty and elegance.

Special grade DyEO Smt Varalakshmi, AEO Sri Uday Bhaskar Reddy, Superintendents Sri, Jnana Prakash,Sri Srihari and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ‌జ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వైభవం

తిరుపతి, 2019 మే 16: హైందవ సనాతన ధర్మంలో ప్రతి ఒక్క జంతువుకు ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారులో గానీ, ఉత్సవములలో గానీ గజానిదే అగ్రస్థానం. సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవికి ఇష్టవాహనం అయిన గజవాహనం లక్ష్మీపతికి కూడా వాహనంగా విశిష్టసేవలు అందిస్తోంది.

సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు ఎస్‌.వి.సంగీత నృత్యకళాశాల వారిచే మంగళధ్వని, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జి.పార్వ‌తి బృందం విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. సాయంత్రం 5.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భక్తి సంగీతం వినిపిస్తారు. శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు అన్న‌మాచార్య సంకీర్త‌న‌ల ఆలాప‌న ఉంటుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటి ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ జ్ఞానప్రకాష్‌, శ్రీ శ్రీ‌హ‌రి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v