LORD RIDES SURYA PRABHA VAHANAM IN TRIVIKRAMA AVATARAM _ సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై త్రివిక్ర‌మ‌ అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tirumala, 22 October 2020: On the seventh day morning of Srivari Navaratri Brahmotsavams on Thursday Sri Malayappa Swamy blessed the devotees on Surya Prabha vahanam in Trivikrama avataram.

Lord was seated in his vahana at Kalyanotsava mandapam inside Srivari temple in view of Covid-19 restrictions.

Legends say that seven horses drag the Sun God, the key architect of life with Anura as his charioteer. Sun God is symbolically represented for blessing with good health and bright future.

The mythology says that the darshan of Sri Malayappa on Surya Prabha Vahanam will provide long life and good health, prosperity to devotees.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, Deputy Speaker Sri Kona Raghupathi, Additional EO Sri AV Dharma Reddy, Board members Sri Meda Mallikarjuna Reddy, Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, Sri Sekhar Reddy, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు  
సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై త్రివిక్ర‌మ‌ అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

తిరుమ‌ల‌, 2020 అక్టోబరు 22: శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురు‌‌‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు త్రివిక్ర‌మ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనం – ఆయురారోగ్య‌ప్రాప్తి

బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్ రెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.