LORDS BLESSINGS TO NEWLY WED COUPLE AT TIRUMALA _ కొత్త జంటలకు కోనేటి రాయుడి ఆశీస్సులు
By TTD News On 3 Jun, 2018 At 10:41 PM | Categorized As General News, Special Articles

Tirumala ,03 June 2018: The TTD’s unique devotee friendly program of facilitation with free weddings for interested couple at Tirumala has drawn huge response .Nearly 10,000 free weddings have been conducted at Kalyana Vedika built at Tirumala since its inception on April 25,2016,

As part of its commitment to promote Sanatana Hindu dharma the TTD freely provided services of purohits,nadaswaram team, Rs.50 rooms and Pasupu/Kumkama kankanams to the wedding party along 12 laddus(Rs.25 each).The wedding party has to bring other material for marragie function and parents presence is a must and if they abstain the couple should present adequate proof of documents.

The TTD later provided a Rs.300 ticket along with a group photo of the new couple together with which the groom, bride and parents of both totally six persons could get free darshan entry .

The devotees interested in free wedding at Tirumala could also book their space and time online on the kalyana vedika column of the website of ttdsevaonline.com .They should also upload their aadhar card or voter ID along with age proof -birth certificates/SSC certificates /TC /Driving license/Passport.An acknowledgment is issued with wedding date and muhurtam selected by them which they have to produce six hours before on the wedding day.

The TTD has also provided current booking facility for the couple and they should be Hindus by caste ,above 18 years (bride) and 21 years(groom).Second weddings or love marraiges are strictly banned.For more details pl contact 0877-2263433

To facilitate the legal registration of weddings performed at Tirumala, the TTD has organised the office of the Hindu Marraiges Registrations at cottage No SMC -233, Tirumala .The newly wedded couple should submit,age proof, proof of residence,wedding photo,wedding invitation,reciept of Kalyana Mandapam and come along with minimum of three witnesses between office hours of 10.30 AM to 5.00 PM .They could contact 0877-2277744.

TTD appeals devotees to utilise the good opportunity provided by Lord Venkateswara and beget his blessings.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కొత్త జంటలకు కోనేటి రాయుడి ఆశీస్సులు

తిరుమలలో ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన

జూన్‌ 03, తిరుమల 2018 ;కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తిరుమలలోని కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్‌ 25 నుండి 2018 జూన్‌ 3వ తేదీ వరకు దాదాపు 10 వేల జంటలు శ్రీవారి సన్నిదిలో వివాహం చేసుకుని ఒక్కటయ్యరు.

ఇందులో భాగంగా పురోహితుడు, మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని, పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టిటిడి ఉచితంగా అందిస్తుంది. వీటితోపాటు 12 లడ్డూలను (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు. వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు. ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.

ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి. వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక ఓటర్‌, ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.

కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు. ఇతర వివరాలకు ఫోన్‌ – 0877 – 2263433 సంప్రదించవచ్చు.

వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు

తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను ఎస్‌.ఎమ్‌.సి – 233 వద్ద ఏర్పాటు చేసింది.

ఇందుకోసం నూతన వదూవరులు తమ వయస్సు ధృవపత్రములు, నివాస ధృవపత్రము, వివాహము ఫోటో, పెండ్లి పత్రిక, కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను. ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను. ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ – 0877 – 2277744 సంప్రదించవచ్చు.

తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `