MAHABHARATA SAPTHAHAM_ ఆర్‌కెవిబి పేట‌లో మ‌హాభార‌త స‌ప్తాహం ప్రారంభం
By TTD News On 15 May, 2019 At 06:19 PM | Categorized As Press Releases

Tirupati, 15 May 19: Mahabharata Santhanam began in Karvetinagaram in Chittoor district on Wednesday.

This programme is being organised by HDPP wing of TTD in all the village Taluku.

Meanwhile this religious programme will confuse on May 21. Every day it will take place betalen 6pm and 9pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆర్‌కెవిబి పేట‌లో మ‌హాభార‌త స‌ప్తాహం ప్రారంభం

తిరుపతి, 2019 మే 15: ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా చిత్తూరు జిల్లా కార్వేటిన‌గ‌రం మండ‌లంలోని ఆర్‌కెవిబి.పేట గ్రామంలో బుధ‌వారం మ‌హాభార‌త స‌ప్తాహం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో మే 21వ తేదీ వ‌ర‌కు శ్రీ మ‌హాభార‌త స‌ప్తాహం జ‌రుగ‌నుంది. టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ప‌లు ప‌ట్ట‌ణాల్లో ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. ఈసారి గ్రామాల్లో దేవాల‌యం కేంద్రంగా స‌ప్తాహం నిర్వ‌హించి చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో భ‌క్తిప్ర‌చారం చేయాల‌ని ఈ కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టింది. ఇందులో భాగంగా ప్ర‌తిరోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌రకు మ‌హాభార‌తం ధార్మికోప‌న్యాసం, ఇత‌ర ఆధ్యాత్మిక‌, భ‌క్తి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మొద‌టిరోజు బుధ‌వారం సాయంత్రం న‌గ‌ర సంకీర్త‌న‌, స‌త్సంగం, సామూహిక భ‌జ‌న నిర్వ‌హించారు. మే 16న స్థానిక క‌ళాకారుల‌తో భ‌జ‌న, మే 17న హ‌రిక‌థ‌, మే 18న గోపూజ‌, మే 19న కుంకుమ‌పూజ‌, మే 20న అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల‌తో భ‌క్తి సంగీతం, మే 21న చిన్నారుల‌కు ప‌ద్య‌ప‌ఠ‌న పోటీలు, శోభాయాత్ర నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v