MAIDEN PUSHPAYAGAM AT KAPILATHEERTHAM ON MAY 18_ శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో పుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌
By TTD News On 17 May, 2019 At 07:09 PM | Categorized As Press Releases

Tirupati, 17 May 19: The TTD is all set to perform Pushpayagam in the famous temple of Sri Kapileswara Swamy in Tirupati on May 18.

This is the first time the temple management is observing this celestial fete in Lord Shiva temple.

Meanwhile Ankurarpanam for the Pushpayagam was held in the temple on Friday evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో పుష్ప‌యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2019 మే 17: తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌యంలో మే 18న శ‌నివారం తొలిసారిగా జ‌రుగ‌నున్న‌ పుష్ప‌యాగానికి శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ విఘ్నేశ్వ‌ర‌పూజ‌, పుణ్యాహ‌వ‌చ‌నం, న‌వ‌క‌ల‌శ‌స్థాప‌న నిర్వ‌హించారు.

కాగా, శ‌నివారం ఉద‌యం సోమ‌స్కంద‌మూర్తుల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగ మ‌హోత్స‌వం నిర్వ‌హిస్తారు. సాయంత్రం 7 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారి తిరువీధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది. రూ.200/- చెల్లించి గృహ‌స్తులు పుష్ప‌యాగంలో పాల్గొన‌వ‌చ్చు.

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ ఉత్స‌వాల్లో అర్చ‌క ప‌రిచార‌కులు, భ‌క్తుల వ‌ల్ల తెలిసీ తెలియ‌క జ‌రిగిన పొర‌బాట్ల‌కు ప్రాయ‌శ్చిత్తంగా పుష్ప‌యాగం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v