MAKE ARRANGEMENTS FOR APPALAYAGUNTA BRAHMOTSAVAMS IN A GRAND MANNER-TIRUPATI JEO_ అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Applayagunta, 4 Jun. 19: TTD Joint Executive Officer for Tirupati Sri B Lakshmikantham has directed the officials to conduct the annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta slated from June 13-21 in a grand manner.

Addressing a review meeting with senior officials at the temple premises on Tuesday, the JEO said the ritual of Koil Alwar Thirumanjanam will be on June 11, Ankurarpanam on June 12, Dwajarohanam on June 13, Garuda seva June 17, Rathotsavam June 20, and Chakra Snanam on June 21.

A majestic event of Srivari Kalyanotsavam will be performed on the evening of June 18 as a part of the annual Brahmotsavams for which elaborate arrangements were made to facilitate large number of devotees.

Arrangements should also be made to bring the famous Lakshmi Haram in a grand procession from Srivari temple at Tirumala to Appalayagunta to be adorned to the Utsava idols on Garuda seva day.

The JEO instructed the engineering officials to speed up repair works to vahanam, erect shamianas, pandals in the Temple premises, platforms for cultural activities and barricades within the stipulated time.

The JEO said SVBC to give live telecast of all events of Brahmotsavams on daily basis and also broadcast all mythological films of Lord Venkateswara. Besides attractive flower and electrical decorations, he wanted adequate arrangements made for providing Medicare to devotees, provision of drinking water, distribution of buttermilk, milk and Anna Prasad am with the help of Srivari Sevakulu and effective security in coordination with local police.

He said adequate Srivari Sevakulu, scouts and guides are deployed to provide all services to devotees. He also asked the TTD officials to use public address and media to give wide publicity to Brahmotsavams in and around Tirupati, Tiruchanoor, and Appalayagunta etc. to attract devotees.

He directed the cultural wings of TTD, HDPP, Annamacharya Project, Dasa Sahitya Project and SV College of Music and Dance College to provide Bhakti sangeet and bhajans during Brahmotsavams.

Spl.Gr.DyEO. Smt Varalakshmi, DyEOs Smt Jhansi Rani, Sri Devendrababu, Sri Nateshbabu, VGO Sri Ashok Kumar Goud, HDPP Secretary Dr Ramana Prasad, Additional Health Officer Dr Sunil Kumar and others participated in the review meeting.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అంగరంగ వైభవంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 జూన్ 04: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. జూన్ 13 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జెఈవో మంగ‌ళ‌వారం ఉద‌యం అధికారులతో శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్ 12న అంకురార్పణ, జూన్ 13న ధ్వజారోహణం, జూన్ 17న గరుడసేవ, జూన్ 20న రథోత్సవం, జూన్ 21న చక్రస్నానం జరుగనున్నాయని తెలిపారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా జూన్ 16వ తేదీ సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు నిర్వహించే కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు వీక్షించేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గరుడ వాహనం రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసుల హారాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి అలంకరించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా వాహ‌నాల మ‌ర‌మ‌త్తులు, తండ్లు త‌దిత‌ర వాటిని ముంద‌స్తుగా ప‌రిశీలించాల‌న్నారు. ఆలయ ప్రాంగణంలో చలువపందిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల వేదికలు, బారికేడ్లు, అవసరమైన ఇంజినీరింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైదిక కార్యక్రమాల కోసం అవసరమయ్యే అర్చకులు, వేదపారాయణదారులను ఇతర ఆలయాల నుంచి డెప్యూటేషన్‌పై నియమించుకోవాలని తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం స్వామివారి వాహనసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క్షేత్ర ప్రాశ‌స్త్యం తేలిపేలా చిన్న చిత్రాలు రూపొందించి ప్ర‌సారం చేయ‌వ‌ల‌సిందిగా ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరికీ తాగునీరు, పాలు, మ‌జ్జిగ‌, అన్నప్రసాదాలు అందించాలన్నారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రతపరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గ్రామపంచాయతీ అధికారులతో చర్చించి పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటుచేయాలని సూచించారు. భక్తులను అలరించేలా విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకుని అప్పలాయగుంట, తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాల‌లో, భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, క‌టౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయాల‌న్నారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని సూచించారు. స్వామివారి వాహనసేవలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఎస్‌ఇ శ్రీ శ్రీరాములు, విజివో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, డెప్యూటీ ఈవోలు శ్రీ దేవేంద్ర‌బాబు, శ్రీ న‌టేష్‌బాబు, శ్రీమతి వరలక్ష్మి, డిపిపి కార్య‌ద‌ర్శి శ్రీ ర‌మ‌ణ‌ప్ర‌సాద్‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖ అధికారి శ్రీ సునిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.