MANTRALAYA MUTT SEER OFFERS PRAYERS _ 10 రోజులు వైకుంఠ ద్వార ద‌ర్శ‌న నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం : శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి

10 రోజులు వైకుంఠ ద్వార ద‌ర్శ‌న నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం : శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి

శ్రీవారిని దర్శించుకున్న మంత్రాల‌యం శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిప‌తి

తిరుమల, 2020 డిసెంబరు 16: వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టిటిడి తీసుకున్న నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయ‌మ‌ని కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిప‌తి శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి చెప్పారు. శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి బుధ‌‌వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామీజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి‌ ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.

ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం వెలుప‌ల శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామి మీడియాతో మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం మ‌ధ్వాచార్య సంప్రదాయంలో ప్రధాన మూల మఠంగా  ఆరాధింప‌బ‌డుతోంద‌న్నారు. 45వ మఠాధిపతిగా తాను కొనసాగుతున్నాన‌ని చెప్పారు. శ్రీ రాఘ‌వేంద్ర‌స్వామివారికి కుల‌దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివార‌ని, ఆ సంప్ర‌దాయాన్ని పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకుంటున్నామ‌ని తెలిపారు. త‌మ మ‌ఠానికి చాలా కాలం నుండి తిరుమ‌ల‌లో ఇస్తిక‌ఫాల్ స్వాగ‌తం ల‌భిస్తోంద‌ని, ఇది ఎంతో సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు. శ్రీ‌వారి కృప‌తో త్వ‌ర‌గా క‌రోనా వ్యాధి న‌శించిపోయి భ‌క్తులంద‌రూ సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని స్వామీజీ ఆకాంక్షించారు.

అఖండ వేద‌పారాయణంలో పాల్గొన్న స్వామీజీ

శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో జ‌రుగుతున్న అఖండ వేద‌పారాయణంలో శ్రీశ్రీశ్రీ‌ సుబుధేంద్రతీర్థ స్వామివారు పాల్గొన్నారు.

ఏప్రిల్ 13 నుండి అఖండ వేద‌పారాయ‌ణం జ‌రుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు కృష్ణ‌య‌జుర్వేద పారాయ‌ణం, జ‌ఠా పారాయ‌ణం పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం ఋగ్వేద పారాయ‌ణం జ‌రుగుతోంది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.  

HAILS TTD’s DECISION TO OPEN VAIKUNTA DWARAM FOR TEN DAYS 

TAKES PART IN RIGVEDA PARAYANAM 

Tirumala, 16 Dec. 20: The 45th Pontiff of Mantralaya Sri Raghavendra Swamy Mutt of Kurnool, H H Sri Sri Subudendra Theertha Swami has offered prayers in the temple of Lord Venkateswara at Tirumala on Wednesday.

Earlier on his arrival, he was received with traditional Isthikaphal Honours (Pedda Maryada) amidst chanting of Veda Mantras at the sacred fig tree located near Old Annaprasadam Complex. After offering prayers to Bedi Anjaneya Swamy temple, he was led to Tirumala temple. He was welcomed and accompanied by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy.

Speaking to media persons outside the Tirumala temple, after darshan of Lord Venkateswara he said, the bond between Tirumala temple and Mantralaya Mutt has been continuing for a long time. “Mantralaya Mutt established by Sadguru Sri Raghavendra Swami has been following and preaching the tenets of Dvaita Siddhanta advocated by Sri Madhwacharya. Lord Venkateswara is the Kula Daiva of Sri Raghavendra Swamy. We are continuing the tradition of visiting Tirumala temple every year and offering prayers to Lord. With the blessings of the Supreme Lord, the world will be free from Corona pandemic soon”, he asserted.

Adding further, he hailed the decision of TTD board and mandarins to open Vaikunta Dwaram for ten days starting from Vaikuntha Ekadasi. “This decision has been taken by TTD after consulting the Peethadhipathis, Agama Scholars and all the religious stalwarts. There is no deviation of Agama Shastra and a laudable decision in the larger interests of the pilgrims”, he maintained.

Earlier, the Pontiff also participated in the Rig Veda Parayanam at Ranganayakula Mandapam in Tirumala temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI