మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
By TTD News On 15 May, 2019 At 04:29 PM | Categorized As Press Releases

మే 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 మే 15: టిటిడి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. బుధవారం సాయంత్రం అంకురార్పణంతో శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

16-05-2019(గురువారం) ధ్వజారోహణం(ఉ|| 10 నుంచి 11 వరకు) పెద్దశేష వాహనం

17-05-2019(శుక్రవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

18-05-2019(శనివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
19-05-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

20-05-2019(సోమవారం) మోహినీ అవతారం గరుడ వాహనం

21-05-2019(మంగళవారం) హనుమంత వాహనం గజ వాహనం

22-05-2019(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

23-05-2019(గురువారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం

24-05-2019(శుక్రవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. మే 23వ తేదీ రాత్రి 7.30 నుండి 9.00 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

———————————————————————

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v