NEARLY 1.97 LAKH DEVOTEES HAD SRIVARI DARSHAN MAY 11 AND MAY 12- JEO_ ఈ ఏడాది శ‌ని, ఆదివారాల‌లో రికార్డు స్థాయిలో 1.97 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం- తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం
By TTD News On 13 May, 2019 At 07:21 PM | Categorized As General News

Tirupati, 13 May 19: TTD In-charge Joint Executive Officer of Tirumala Sri B Lakshmi Kantham said that the about 1.97lakh pilgrims had darshanam on Second Saturday and Sunday which is record of its sorts.

Speaking after review meeting at TTD administrative building in Tirupati on Monday morning the JEO said while nearly 96,000 devotees were blessed with darshan on Saturday, about 1.01 lakh odd devotees could get Srivari darshan on Sunday.

All departments of TTD had coordinated and rolled out all arrangements for devotee comforts in Vaikuntam 1&2 and also in outside compartments.

The JEO said the temple officials took special care to provide quicker and hassle free darshan to all devotees and cut short their waiting time.

Even at the Kalyana Katta and mini Kalyana Kattas over 1000 barbers worked 24×7. The Radio and Broadcasting wing of TTD kept the devotees informed on availability of rooms and also adequate number of laddu Prasadam. The LED display boards in VQC showcased the timings of expected release of compartments, which enabled the pilgrims to wait with patience for their turn for darshanam.

Additional staffs were deployed in Narayanagiri gardens and Vaikuntam queue complex to streamline medical, sanitation, Anna Prasadam, etc. while the PWFS volunteers have continuously monitored the distribution of buttermilk, beverages, anna prasadam and milk for children in compartments.

The JEO said TTD has made extensive and elaborate arrangements to tackle the special holiday crowds descending on Tirumala. Apart from temple, vigilance, engineering, medical, health and anna prasadam wings the contribution by IT and Transport wings are also incredible, he added.

He also lauded all the TTD officials, staff for their selfless and painstaking services to lakhs of devotees during the summer holidays. “We could able to achieve this only with the cooperation of pilgrims. In spite of long waiting hours, the devotees waited with patience till their turn for darshanam. I thank every pilgrim for their disciplined gesture”, he added.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఈ ఏడాది శ‌ని, ఆదివారాల‌లో రికార్డు స్థాయిలో 1.97 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం- తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుమల, 2019 మే 13: క‌లియుగ‌ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని మే 11, 12వ తేదీల‌లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.97 ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్న‌ట్లు టిటిడి తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో అధికారుల స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 11న శ‌నివారం దాదాపు 96వేల మంది, మే 12న ఆదివారం 1.01ల‌క్ష‌ల మంది |శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు తెలిపారు. వైకుంఠ‌క్యూకాంప్లెక్స్ 1 మ‌రియు 2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌లోని క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి సేవ‌లందించాయ‌న్నారు.

శ్రీవారి ఆలయ అదికారులు, సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు క్యూలైన్లను క్రమబద్ధీకరించార‌న్నారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో ఆదనపు స్బిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాలలోని గదుల వివరాలను ఎప్పటికప్పుడు టిటిడి రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నామ‌న్నారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచిన‌ట్లు తెలిపారు.

నారాయణగిరి ఉద్యానవనాలలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు మరియు వైకుంఠం – 1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారిసేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీ‌వారిసేవ‌కులు క్యూలైన్ల నిర్వ‌హ‌ణ‌, ల‌డ్డూ ప్ర‌సాదాల పంపిణీ, ప‌ర‌కామ‌ణి త‌దిత‌ర విభాగాల‌లో సేవ‌లందిస్తున్నారు. అదేవిధంగా యాత్రికుల సంక్షేమ సౌక‌ర్యాల సేవ‌కులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తు ఎప్ప‌టిక‌ప్పుడు సంబంధిత అధికారుల‌కు స‌మాచారం అందించి స‌త్వ‌రం ప‌రిష్కార‌మ‌య్యేలా సేవ‌లందించిర‌న్నారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్యవిభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటుచేశామ‌న్నారు. టిటిడి ఇంజినీరింగ్‌, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టార‌న్నారు.

వేసవి సెలవులు కావడంతో తిరుమలకు ల‌క్ష‌లాదిగా విచ్చేసే భక్తులకు క‌ల్యాణ‌క‌ట్ట‌, భ‌ద్ర‌త‌, ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, రెడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌, వైద్యం, ఐటి, ర‌వాణా విభాగం తదితర అంశాలపై టిటిడి ప్రత్యేక దృష్టి సారించి విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు.

వేసవి సెలవుల్లో విచ్చేసిన లక్షలాదిమంది భక్తులకు విశేష సేవ‌లందించిన‌ టిటిడి అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, శ్రీ‌వారిసేవ‌కులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇంత ర‌ద్దీ ఉన్నద‌ర్శ‌నానికి గంట‌ల త‌ర‌బ‌డి వేచి ఉండి సంయ‌మ‌నంతో టిటిడి అధికారుల‌కు స‌హ‌క‌రించిన భ‌క్తుల‌కు జెఈవో ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v