NEW BOARD MEMBER SWORN IN_ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ ఎస్‌.ప్రసాద్‌ బాబు ప్రమాణస్వీకారం
By TTD News On 22 Feb, 2019 At 11:25 AM | Categorized As Board News

Tirumala, 22 February 2019: Sri S Prasad Babu of Kadapa took oath as TTD Trust Board member in Tirumala on Friday in Srivari temple.

Tirumala temple DyEO Sri Harindranath administered oath inside temple and later he had darshanam of Lord Venkateswara.

Later the vedic pundits offered Vedasirvachanam at Ranganayakula Mandapam. He was presented with Theertha Prasadams by TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav.

DyEO Board Cell Smt Malleswari, Peishkar Sri Ramesh Babu were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా శ్రీ ఎస్‌.ప్రసాద్‌ బాబు ప్రమాణస్వీకారం

తిరుమల, 22 ఫిబ్రవరి 2019: టిటిడి ధర్మకర్తల మండలి సభ్యునిగా కడప జిల్లా రాయచోటికి చెందిన శ్రీ ఎస్‌.ప్రసాద్‌బాబు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ నూతన సభ్యుడితో ప్రమాణం చేయించారు.

శ్రీ ప్రసాద్‌బాబు స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సెల్‌ డెప్యూటీ ఈవో శ్రీమతి సి.మల్లీశ్వరిదేవి, పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v