జ‌న‌వ‌రి 1న 2.50 గంట‌ల నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం నిర్ణీత స‌మ‌యం కంటే ముందుగా ప్రారంభించ‌డంతో భ‌క్తుల సంతృప్తి

జ‌న‌వ‌రి 1న 2.50 గంట‌ల నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం నిర్ణీత స‌మ‌యం కంటే ముందుగా ప్రారంభించ‌డంతో భ‌క్తుల సంతృప్తి

తిరుమల, 2019, జనవరి 01: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 1న మంగ‌ళ‌వారం ఉద‌యం 2.50 గంట‌ల‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. నిర్ణీత స‌మ‌యం కంటే 1.40 గంట‌ల ముందుగా ద‌ర్శ‌నం ప్రారంభం కావ‌డంతో భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, స‌మ‌న్వ‌యం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేప‌ట్టారు. కాగా, జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో విశేషంగా పుష్పాలంంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు. ధ్వజస్తంభం, మహద్వారం ప్రాంతాల్లో రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. తిరుమలలోని ముఖ్య‌ కూడళ్లలో పుష్పాల‌తో అలంక‌ర‌ణ చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.