NRISIMHA JAYANTHI IN TIRUMALA_ మే 17న శ్రీ నృసింహ జయంతి
By TTD News On 16 May, 2019 At 04:06 PM | Categorized As Press Releases

Tirumala, 16 May 19: The important festival of Nrisimha Jayanthi will be observed in Tirumala temple on Friday.

As a part of this fete, special abhishekam will be rendered to Sri Yoga Narasimha Swamy in the sub temple located inside Tirumala shrine on Friday evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 17న శ్రీ నృసింహ జయంతి

తిరుమల, 2019 మే 16: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 17వ తేదీ శుక్ర‌వారం నృసింహ జయంతి ఘనంగా జరుగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసంలో ఈ ఉత్సవం చేపడతారు. శ్రీ యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లో వెంగమాంబ జయంతి అనంతరం ఉభయనాంచారులతో కలిసి శ్రీ మలయప్పస్వామివారు తిరిగి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత శ్రీ యోగ నరసింహస్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.

శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. యోగముద్రలో ఉన్న ఈ విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతులలో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి స్వామివారు సగభాగం మానవ రూపంలోనూ, మరో సగభాగం శ్రీవారి అవతారమైన సింహం రూపంలోనూ ఉంటారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v