ONLINE BOOKING OF TTD KALYANA MANDAPAMS FACILITATAED_ ఆన్‌లైన్‌లో టిటిడి కల్యాణమండపాల బుకింగ్‌ సదుపాయం
By TTD News On 19 Mar, 2019 At 06:01 PM | Categorized As Press Releases

Tirupati, 19 Mar. 19: As a part of its drive to provide hassle-free facilitation of services, TTD has rolled out online booking of the it’s Kalyana Mandapams through the website http://ttdsevaonline.com/

There are 210 Kalyana Mandapams in Andhra Pradesh and 74 in Telangana states which could be utilized by the devotees for events like Weddings, Upanayanam, namakaranams, Shastipurti, Annaprasanam and Satyanarayana vratam.

Among those in AP, Kalyana mandapams are in Chittoor, 22 in Kadapa, 11 in Kurnool, 22 in Anantapur, 11 in Nellore, 13 in Prakasam, 18 in Guntur, 57 in East Godavari, 6 in Visakhapatnam, 5 in Vizianagaram and 4 in Srikakulam. While in Telangana, 4 in Adilabad, 5 each in Hyderabad, Nalgonda, Kamareddy, Nizamabad and Kodad, 6 each in Sangareddy and Karimnagar, 4 each in Jogipet and Bodhan, 11 in Mahbubnagar, 7 in Khammam and 3 in Hanamkonda.

The devotees could register themselves on the TTD website and later choose their location in the district and state. After selecting the date, they should upload their Aadhaar or driving license and the photograph on the site before payment of prescribed fee. After completing the process, the devotee will get confirmation receipt and automatic SMS from the concerned persons and supervisory staff to make necessary arrangements. The devotee should show the SMS and receipt to conduct their event on their selected date.

The booking of Kalyana Mandapams in AP commenced on March 15 in on-line while those of TS will be enabled in a couple of days.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో టిటిడి కల్యాణమండపాల బుకింగ్‌ సదుపాయం

మార్చి 19, తిరుమల, 2019: ఉభయ తెలుగు రాష్ట్రాలలో గల కల్యాణ మండపాలను ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయాన్ని భక్తులకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. ttdsevaonline.com వెబ్‌సైట్‌లో టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు.

చిత్తూరు జిల్లాలో 41, కడపలో 22, కర్నూలులో 11, అనంతపురంలో 22, నెల్లూరులో 11, ప్రకాశంలో 13, గుంటూరులో 18, తూర్పుగోదావరిలో 57, విశాఖపట్నంలో 6, విజయనగరంలో 5, శ్రీకాకుళంలో 4 కలిపి ఆంధ్రప్రదేశ్‌లో 210 కల్యాణమండపాలు ఉన్నాయి.

అదేవిధంగా, అదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 5, కామారెడ్డిలో 5, సిద్ధిపేటలో 5, సంగారెడ్డిలో 6, హైదరాబాద్‌లో 5, జోగిపేటలో 4, మహబూబ్‌నగర్‌లో 11, నల్గొండలో 5, కోదాడలో 5, ఖమ్మంలో 7, హన్మకొండలో 3, కరీంనగర్‌లో 6, బోధన్‌లో 4 కలిపి తెలంగాణ రాష్ట్రంలో 74 టిటిడి కల్యాణమండపాలు ఉన్నాయి.

వివాహం, ఉపనయనం, నిశ్చితార్థం, నామకరణము (బారసాల), షష్టిపూర్తి, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, రిసెప్షన్‌ వంటి శుభకార్యాలకు టిటిడి కల్యాణమండపాలను బుక్‌ చేసుకోవచ్చు.

ఎలా బుక్‌ చేసుకోవాలి..

ttdsevaonline.com వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లా, సంబంధిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ఖాళీగా ఉన్న తేదీలను ఎంపిక చేసుకున్న తరువాత ఫొటోతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో ఏదోఒకటి అప్‌లోడ్‌ చేయాలి. కల్యాణమండపాల స్థాయిని బట్టి నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సంబంధిత వ్యక్తులకు, కల్యాణమండపం పర్యవేక్షణ అధికారికి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ను చూపి కల్యాణమండపంలో కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v