OVER 1000 TTD EMPLOYEES GET VACCINATED _ వెయ్యి మంది టిటిడి ఉద్యోగుల‌కు కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

Tirumala, 16 Mar. 21: In the last ten days, over 1000 employees of TTD were vaccinated and reported no side effects.

With the intervention of TTD EO Dr KS Jawahar Reddy who had written a letter to the Government stating the key role played by the TTD employees during the Corona crisis and rendered services to pilgrims as front warriors. The Covid vaccination programming commenced for its employees at Tirumala and Tirupati in TTD on March 5.

On Tuesday, TTD Additional EO Sri AV Dharma Reddy, Srivari temple Chief Priest Sri Venugopala Deekshitulu also underwent Covid vaccination at Tirumala. The Additional EO called upon the employees to have a vaccination, as it is completely safe.

In the ongoing first phase, the employees who crossed 45 years and those with comorbidities are being rendered vaccination and in the last so far 302 employees underwent vaccination in TTD Central Hospital while 710 employees at Aswini Hospital in Tirumala till date.

Health Officer Dr RR Reddy, Chief Medical Officer Dr Narmada, Central Hospital Medical Superintendent Dr Kusuma, Aswini Hospital Medical Superintendent Dr Kusuma Kumari are supervising the vaccination programming for the employees at Tirumala and in Tirupati.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వెయ్యి మంది టిటిడి ఉద్యోగుల‌కు కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

తిరుమల, 2021 మార్చి 16: శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేస్తున్న భ‌క్తుల‌కు నేరుగా సేవ‌లందిస్తున్న వివిధ విభాగాల్లోని వెయ్యి మందికి పైగా ఉద్యోగుల‌కు టిటిడి ఇప్ప‌టివ‌రకు కోవిడ్ వ్యాక్సినేష‌న్ అందించింది. టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఆదేశాల మేర‌కు మార్చి 4వ తేదీ నుండి తిరుమ‌ల‌లో, మార్చి 5వ తేదీ నుండి తిరుప‌తిలో ఉద్యోగుల‌కు వ్యాక్సిన్లు వేస్తున్నారు.

మొద‌టి విడ‌త‌లో భ‌క్తుల‌కు నేరుగా సేవ‌లందించే ఉద్యోగుల‌కు, రెండో విడ‌త‌లో 45 ఏళ్లు పైబ‌డి, షుగ‌ర్‌, బిపి స‌మ‌స్య‌లు ఉన్న వారికి, మూడో విడ‌త‌లో ఇత‌ర ఉద్యోగులంద‌రికీ వ్యాక్సిన్లు వేస్తారు.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌లో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకుని కోవిడ్ వ్యాధి నుండి సుర‌క్షితంగా ఉండాల‌ని కోరారు.

టిటిడి సిఎంఓ డాక్ట‌ర్ న‌ర్మ‌ద, ఆరోగ్యాధికారి డాక్ట‌ర్ ఆర్ఆర్‌.రెడ్డి ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల అశ్విని ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కుసుమకుమారి, తిరుప‌తిలోని కేంద్రీయ వైద్య‌శాల సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ కుసుమ ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.