OVER 4.39LAKHS HAD DARSHAN OF LORD IN FIVE DAYS_ గ‌త ఐదు రోజుల‌లో 4.39 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం
By TTD News On 16 May, 2019 At 04:07 PM | Categorized As Press Releases

Tirumala, 16 May 19: A record number of 4.39 lakh pilgrims had darshanam of Lord Venkateswara in Tirumala from May 11 to 15.

The mid summer May has witnessed heavy turn out of pilgrims especially on Second Saturday and Sunday.

When about 95,016 pilgrims had darshanam on May 11, 1,01,086 pilgrims made it on Sunday, while Monday recorded a total of about 87,947 pilgrims, Tuesday recorded 80,156 and on Wednesday May 15 about 74,309 pilgrims had darshanam taking the total to 4,38,514 lakhs for five days taking the average to nearly 88 thousands per day.

TTD achieved this figure with the tireless contributions of its strong work force and team work of all departments under the instructions of EO Sri Anil Kumar Singhal in the supervision of Tirumala Incharge JEO Sri B Lakshmikantham.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గ‌త ఐదు రోజుల‌లో 4.39 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

తిరుమల, 2019 మే 16: వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీవారిని మే 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు దాదాపు 4.39 ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి అధికారులు, సిబ్బంది స‌మిష్టి కృషి వ‌ల‌న నిర్ణీత స‌మ‌యంలో స్వామివారి ద‌ర్శ‌నం క‌ల్పించారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, విజిలెన్స్‌, శ్రీ‌వారి సేవ‌కులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 4 ల‌క్ష‌ల 38 వేల‌, 514 మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించారు. కాగా, మే 11న శ‌నివారం 95,016 మంది, మే 12న ఆదివారం 1,01,086 మంది, మే 13న సోమ‌వారం 87,947, మే 14న మంగ‌ళ‌వారం 80,156 మంది, మే 15న 74,309 మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. స‌రాస‌రిన ప్ర‌తి రోజు 87,702 మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.

తిరుమ‌ల‌కు విచ్చేసిన భ‌క్తులంద‌రికి అన్న‌ప్ర‌సాదాలు, వ‌స‌తి, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు ఆయా విభాగాలు విశేషంగా కృషి చేశాయి. ర‌వాణా విభాగం ఆధ్వ‌ర్యంలో ధ‌ర్మ‌ర‌థాలు నిరంత‌రం తిరుగుతూ వేస‌విలో భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించింది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v