OVER 5.1LAKH PILGRIMS HAD HASSLE FREE DARSHAN IN THE LAST SIX DAYS IN TIRUMALA-TIRUMALA IN-CHARGE JEO SRI B LAKSHMIKANTHAM_ భ‌క్తులకు సంతృప్తిక‌రంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం – గ‌త ఆరు రోజుల‌లో 5.1 ల‌క్ష‌ల మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు టిటిడి తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం
By TTD News On 17 May, 2019 At 07:17 PM | Categorized As General News

Tirumala, 17 May 19: The total number of pilgrims who had darshan in the last six days has crossed over 5.1lakhs in Tirumala, said Tirumala In-charge JEO Sri B Lakshmikantham.

After carrying out inspections on Friday evening in Sarva Darshanam Complex, VQC Kitchen, Senior Citizen line, Stone Arch at ATC, greenery in dividers, the JEO instructed the concerned the officials to enhance the quality of service.

Later speaking to media persons, the JEO said, with the team work of all departments, hassle free, speedy darshan without much waiting in spite of swarming crowd has been ensured in the last six days in Tirumala. “Even today, tomorrow and on Sunday also we are anticipating heavy influx of pilgrims since the Tenth class results are out. All our officers and their staffs are working day and night to meet the needs of the pilgrim rush”, he added.

Adding further, the JEO said, TTD is on a mission to enhance the greenery in Tirumala and Tirupati. “We are now focusing on how to improve bio-wall to provide a balanced environment in the hill town of Tirumala as well in the temple city of Tirupati. Today I had inspected all the dividers, meridians where the forest department is coming up with a planned plantation programme”, he maintianed.

SE II Sri Ramachandra Reddy, Temple DyEO Sri Harindranath, VSO Sri Manohar, Health Officer Dr Sermista and other officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPAT

భ‌క్తులకు సంతృప్తిక‌రంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం – గ‌త ఆరు రోజుల‌లో 5.1 ల‌క్ష‌ల మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు టిటిడి తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుమల, 2019 మే 17: క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకునేందుకు దేశ విదేశాల నుండి విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, గ‌త 6 రోజుల‌లొ 5.1 ల‌క్ష‌ల మందికి సంతృప్తి క‌రంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించిన‌ట్లు టిటిడి తిరుమ‌ల ఇన్‌చార్జ్ జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం జెఈవో, అధికారుల‌తో క‌లిసి తిరుమ‌ల‌లోని ప‌లు ప్రాంతాల‌లో త‌నిఖీలు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో మే నెల‌లో విశేష సంఖ్య‌లో తిరుమ‌ల‌కు విచ్చేసిన భ‌క్తులంద‌రికి అన్న‌ప్ర‌సాదాలు, వ‌స‌తి, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ద‌ర్శ‌నం, ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌దిత‌ర సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి విశేష సేవ‌లందిచాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అధికారులు, సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, శ్రీ‌వారిసేవ‌కులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అంత‌కుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ టోకెన్ల పరిశీలన, లడ్డూ టోకెన్ల మంజూరును పరిశీలించారు. భక్తులందరికీ టి, కాఫి, తాగునీరు, అల్పాహారం, అన్న‌ప్ర‌సాదాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు సులువుగా అర్థమయ్యేలా సూచికబోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని వంట‌శాల‌ను, వంట‌కు వినియోగించే ముడి స‌రుకుల‌ను ప‌రిశీలించారు. కంపార్టుమెంట్ల‌లోని భ‌క్తుల‌కు టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు. భ‌క్తులు టిటిడి అందిస్తున్న సౌక‌ర్యాల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. తిరుమ‌ల‌లో ప‌చ్చ‌ద‌నం పెంపొందించ‌డంలో భాగంగా బ‌యోవాల్ (హ‌రిత ప్ర‌హ‌రీలు)ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

అనంత‌రం వ‌యోవృద్ధులు, దివ్యాంగులు వేచి వుండే షెడ్డును, అక్క‌డ వారికి అందిస్తున్న సౌక‌ర్యాల‌ను ప‌రిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ – 1 వ‌ద్ద టిటిడి అట‌వీ విభాగం ఏర్పాటు చేసిన బ‌యోవాల్ (హ‌రిత ప్ర‌హ‌రీలు)ను ప‌రిశీలించారు. పిఏసి-4లో త‌నిఖీలు నిర్వ‌హించి, భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా అద‌న‌పు లాక‌ర్లు ఏర్పాటు చేయాల‌ని, మ‌రింత మెరుగ్గా పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప్ప‌ట్టాల‌న్నారు.

టిటిడి స్థానిక ఆల‌యాలైన తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వ‌మివారి ఆల‌యం, తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ‌నివాస మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల ప్రాశిస్త్యం భ‌క్తుల‌కు తెలిసేలా ఎస్వీబిసిలో 4 నిమిషాలు వ్య‌వ‌ధి గ‌ల చిన్న చిత్రాల‌ను క్యూలైన్లు, కంపార్టుమెంట్ల‌లోని టివిల‌లో ప్ర‌సారం చేస్తుంద‌న్నారు.

అంత‌కుముందు తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం ఉద‌యం వేస‌వి సెల‌వులు, 10వ త‌ర‌గ‌తి ప‌రిక్ష ఫ‌లితాలు విడుద‌ల వ‌ల‌న తిరుమ‌ల‌లో రోజు రోజుకు పెరుగుతున్న ర‌ద్దీకి అనుగుణంగా చేయ‌వ‌ల‌సిన ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఆరోగ్య విభాగం అధికారి డా..శ‌ర్మిష్ఠ‌, డిఎఫ్‌వో శ్రీ ఫ‌ణికుమార్ నాయుడు, ఎవిఎస్వోలుశ్రీ గంగ‌రాజు, శ్రీ చిరంజీవులు, ఇతర అధికారులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v