PADMAVATHI APP SOON FOR AUGMENTATION REALTY TECHNOLOGY-JEO_ శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుపతి జెఈవో పరిశీలన
By TTD News On 11 Mar, 2019 At 05:13 PM | Categorized As General News

3D MAPPING SOON IN PADMA PUSHKARINI

INSPECTS SRI PADMAVATHI TEMPLE AT TIRUCHANOOR

Tiruchanoor, 11 March 2019: Sri Padmavathi Ammavaru App will soon be introduced with which the devotees can enjoy and experience the Augmentation Realty Technology by downloading the app, said, Tirupati JEO Sri B Lakshmikantham.

The JEO inspected Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Monday.

After inspection, he said, the mythology of Tiruchanoor and the history behind the incarnation of Ammavaru have been placed in Friday Gardens for the information of the pilgrims in the form of photographs.

He said, these photos will soon be linked with Augmentation Realty Technology Software. “With this provision, if any body clicks on any photograph, that image narrates its story, which will be interesting and attractive for pilgrims. For this the devotees have to download the app first. In second phase, we are contemplating to extend this technology to sculptures on temple pillars, where the stone images speak to us giving a unique thrilling experience. Apart from these 3D Laser and Projection Mapping will also introduced soon where one can witness the images of deities on waters of temple tank”, he added.

The JEO said, all the development proposals in the master plan will be taken up in a phased manner.

DyEO Smt Jhansi Rani, EE Sri Satyanarayana, AVSO Sri Surendra Babu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుపతి జెఈవో పరిశీలన

మార్చి 11, తిరుపతి, 2019: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం సోమవారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఫ్రైడే గార్డెన్‌లో ఆలయ స్థలపురాణం, అమ్మవారి పుట్టుక, శ్రీపద్మావతి పరిణయం, శ్రీనివాసుడి కల్యాణం వరకు వరుసక్రమంలో ఛాయచిత్రాలతో కూడిన కథనాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆగ్‌మెంటేషన్‌ రియాలటీ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ను లింక్‌ చేస్తున్నామని, భక్తులు శ్రీ పద్మావతి అమ్మవారి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఆయా ఛాయచిత్రాన్ని స్కాన్‌ చేసినట్లు అయితే ఛాయచిత్రంలోని దేవతలు, ఋషులు తమ వృత్తాంతాన్ని తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రెండో దశలో మండపం స్తంభాలలోని శిల్పాలను లింక్‌ చేయడం వల్ల శిల్పాలే మాట్లాడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా భక్తులు ప్రత్యేక అనుభూతి పొందవచ్చని తెలిపారు. 3డి లేజర్‌ కమ్‌ ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌ ద్వారా పద్మపుష్కరిణిలో అమ్మవారి పురాణ మహిమలు, రూపాలు నీటిలో కనిపించేలా చర్యలు చేపట్టామన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తిరుచానూరులో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు.

జెఈవో వెంట టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఈఈ శ్రీ సత్యనారాయణ, ఏవిఎస్‌వో శ్రీ సురేంద్రబాబు, ఇతర అధికారులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v