PATTABHISHEKA ASTHANAM PERFORMED IN SRI TT_ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
By TTD News On 15 Apr, 2019 At 10:35 PM | Categorized As Press Releases

Tirumala, 15 Apr. 19: Sri Rama Pattabhisheka Asthanam was performed in Tirumala temple on Monday night.

The temple court was performed between 10pm and 11pm in Bangaru Vakili where in the coronation ceremony of Lord Sri Rama episode was rendered by vedic scholars in front of the deities of Sri Sita Lakshmana Sametha Sri Rama in a traditional manner.

Tirumala JEO Sri KS Sreenivasa Raju and other officers were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

ఏప్రిల్ 15, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద‌యం శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముల‌వారు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌ను రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేశారు. సాయంత్రం విశేష స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. రాత్రి 8 గంటలకు బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలోని పట్టాభిషేక ఘట్టాన్ని పఠిస్తారు. ఈ ఉత్సవం కారణంగా వసంతోత్సవ సేవను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v