MAJESTIC SRI RAMA PATTABHISHEKAM AT SRI KRT_ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
By TTD News On 16 Apr, 2019 At 08:25 PM | Categorized As Temple News

Tirupati, 16 Apr. 19: The majestic and celestial event of Sri Rama Pattabhisekam was conducted on Tuesday evening at the Sri Kodandarama Swamy temple in Tirupati amidst resounding chanting of Vedic mantras.

Earlier in the morning the utsava idols were given Snapana Thirumanjanam
With holy waters brought from the ancient Narasimha thirtham.

Sri Rama Pattabhisekam, the coronation ceremony provided cynosure to all devotees

Tirupati JEO Sri B Lakshmi Kantham, DyEO Sri Sridhar, AEO Sri Thirumalaiah, other staffs, devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

ఏప్రిల్ 16, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ మర్యాదలతో నరసింహతీర్థం నుండి ఆలయానికి తీర్థాన్ని తీసుకొచ్చారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, చతుర్దశకలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ జి.రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వై.రమేష్‌ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v