PAVITROTSAVAM COMMENCES AT TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు ప్రారంభం

Tiruchanoor, 31 Aug. 20: The three day Pavitrotsavam festival commenced at the Sri Padmavati temple in Tiruchanoor on Monday in Ekantham in view of COVID-19 restrictions.

Pavitrotsavam is an annual festival held to ward off the ill effects of any lapses committed by either the archakas or devotees during the year long activities in the temple.

As part of the Day one rituals, the utsava idols are seated in the Yagashala for Dhwaja Thorana, Dhwaja Kumbhaavahanam, Chakradhimandala Puja, Chatusthanarchana, Agni Pratista and Pavitra Pratista.

In the afternoon the utsava idols were given grand Snapana Tirumanjanam, Abhisekam with scented water, Sandalwood paste, Coconut water, Curd and Honey.

Temple Dyeo Smt Jhansi Rani, AEO Sri Subramaniam, Kankanabhattar Sri Manikanthaswami and others also participated in the religious event.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి  పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుప‌తి, 2020 ఆగ‌స్టు 31: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. కోవిడ్ – 19 నిబంధన‌ల మేర‌కు ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలను ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నారు.
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాధి మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ఠ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించారు.
మధ్యాహ్నం శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, కంకణభట్టార్ శ్రీ మణికంఠస్వామి, సూపరింటెండెంట్‌ శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ రాజేష్ కన్నా, ప్రసాదం ఇన్స్పెక్టర్ శ్రీ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.