PAVITROTSAVAMS CONCLUDES WITH PURNAHUTI_ పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
By TTD News On 13 Aug, 2019 At 10:56 PM | Categorized As Temple News

Tirumala, 13 Aug. 19: The annual Pavitrotsavams concluded with Purnahuti on Tuesday.

After the morning rituals in Yaga Shala, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Malayappa Swamy, Sri Devi and Bhudevi.

Later in the night between 7 pm and 10 pm Purnahuti was performed by the archakas with religious fervour.

TTD EO Sri Anil Kumar Singhal, Special Officer Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Lokanatham were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

ఆగస్టు 13, తిరుమల 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారంనాడు పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

తొలి రెండురోజుల్లాగానే మంగ‌ళ‌వారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీంతో స్నపనతిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.

కాగా, సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ మలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవితో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో మంగ‌ళ‌నాడు అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సీవీఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్‌ శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v