PEJAWAR SEER OFFERS PRAYERS IN TIRUMALA SHRINE _ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఉడిపి శ్రీ పెజావర్‌ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ
By TTD News On 15 May, 2018 At 01:20 PM | Categorized As VIP News

Tirumala, 15 May 2018: HH Sri Sri Sri Vishvesha Teertha Swamy of Pejawar Mutt, Udupi, Karnataka offered prayers in the hill temple of Lord Venkateswara on Tuesday.

He was accorded traditional welcome amidst the chanting of veda mantras. TTD EO Sri Anil Kumar Singhal accompanied by Tirumala JEO Sri KS Sreenivasa Raju welcomed the 32nd pontiff of Pejawar peetham.

GOLDEN PADALU PRESENTED

The octogenarian pontiff of the mutt presented a pair of “Swarna Padagalu” weighing around 300 to 400 gms to Sri Malayappa Swamy, the processional deity of Lord Venkateswara on this occasion.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఉడిపి శ్రీ పెజావర్‌ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ

తిరుమల 15 మే 2018 ; కర్నాటకలోని ఉడిపిలో ప్రసిద్ధి చెందిన శ్రీ పెజావర్‌ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వేశ తీర్థ స్వామీజీ మంగళవారం ఉదయం కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శిష్యుబృందంతో దర్శించుకున్నారు. ద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన శ్రీమధ్వాచార్యులు స్థాపించిన అష్టమఠాల్లో శ్రీ పెజావర్‌ మఠం ఒకటి. ప్రస్తుతం 32వ పీఠాధిపతిగా శ్రీవిశ్వేశతీర్థస్వామీజీ కొనసాగుతున్నారు.

ముందుగా టిటిడి జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు, అర్చకస్వాములు, అధికారులు వారికి ఆలయమర్యాదలతో ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అక్కడ నుంచి శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించారు.

ఉడిపి పెజావర్‌ మఠం తరుపున శ్రీమలయప్పస్వామివారికి సుమారు 300 గ్రాముల బంగారంతో బంగారు పాదాలను బహూకరించారు. అనంతరం శ్రీ విశ్వేశ తీర్థ స్వామిజీతోపాటు తిరుమలలోని ఉడిపి మఠానికి టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చేరుకున్నారు. అక్కడ టిటిడి ఈవోను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలొ బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు, ఏఈవో శ్రీ రమేష్‌బాబు, ఏవీఎస్‌వో శ్రీ కూర్మారావు, అర్చక స్వాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `