PHALGUNA MASA UTSAVAMS TO BE OBSERVED BY TTD-EO _ టిటిడి ఆధ్వ‌ర్యంలో ఫ‌ల్గుణ మాస ఉత్స‌వాలు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala, 05 March 2021: After receiving overwhelming response from global devotees for it’s Karthika, Dhanur, Magha Masa Utsavams, TTD is now set to observe series of spiritual programmes in the ensuing Phalguna Masam, said TTD EO Dr KS Jawahar Reddy.

Before taking calls from pilgrim callers during the monthly Dial your EO Programme held at Annamaiah Bhavan in Tirumala, the EO briefed on the development activities taken up by TTD for the sake of pilgrims and upcoming festivals. He said as part of the promotion of Hindu Sanatana Dharma, TTD has been observing various rituals and pujas in different Telugu months. In the ensuing Phalguna Masam also, series of religious events have been lined up including Mrulingarchana, Aamalaki Ekadasi, Lakshmi Jayanthi, Seetlastami etc.

The EO said, Arjita sevas which were stopped since Covid lockdown in March 2020 to be revived from April 14 for devotees with who have booked in advance. He also said Covid test certification before three days (72hours) is a must for the devotees who are taking part in Arjitha Sevas.

He said from March 24 to 28, annual Srivari float festival (Teppotsavams) will be observed at Tirumala in Swami Pushkarini.

The EO briefed on TTD board resolution to write to Government of India seeking to declare Cow as a national animal. He said TTD is organising annual brahmotsavams in all local temples at Srinivasa Mangapuram, Kapilatheertham, and Kodandaramaswamy in Ekantam.

Upon the request of pilgrim devotees, we soon introduce Tulabharam also at Tiruchanoor on the lines of Srivari temple, EO added.

Additional EO Sri AV Dharma Reddy, JEO Smt Sada Bhargavi, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, CEO SVBC Sri Suresh Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆధ్వ‌ర్యంలో ఫ‌ల్గుణ మాస ఉత్స‌వాలు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

05 మార్చి, 2021 తిరుమ‌ల‌: హిందూ ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ఎస్వీబీసీ ద్వారా నిర్వ‌హించిన కార్తీక‌, ధ‌నుర్‌, మాఘ మాస ఉత్స‌వాల‌కు భ‌క్తుల నుండి విశేషాద‌ర‌ణ ల‌భించింద‌ని, ఈ క్ర‌మంలో ఫ‌ల్గుణ మాసంలో మృలింగార్చ‌న‌, ఆమ‌ల‌కి ఏకాద‌శి, ల‌క్ష్మీ జ‌యంతి, సీత‌లాష్ట‌మి పూజాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం జ‌రిగిన డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో ముందుగా భ‌క్తుల‌ను ఉద్దేశించి ఈవో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– టిటిడి ఎస్వీబీసీ ద్వారా నిర్వ‌హిస్తున్న పారాయ‌ణ కార్య‌క్ర‌మాల‌కు, తెలుగు మాసాల్లో విశేష‌మైన రోజుల్లో నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. వీటిని శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నిర్వ‌హించ‌డానికి చ‌ర్య‌లు చేప‌డుతున్నాం.

ర‌థసప్తమి

– ఫిబ్రవరి 19వ తేదీ రథసప్తమి సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఏడు వాహనాల్లో నాలుగు మాడ వీధుల్లో భక్తుల‌కు దర్శనభాగ్యం ఇచ్చారు. కోవిడ్‌-19 నిబంధన‌లు పాటిస్తూ భక్తుల‌ కోసం టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి వాహన సేవల‌ను దర్శించుకున్నారు.

మాఘ మహోత్సవం

– ఫిబ్రవరి 12 నుండి మార్చి 13వ తేదీ వరకు తిరుమల‌ నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 6.40 గంటల‌ వరకు మాఘపురాణం ప్రవచనం కార్యక్రమం నిర్వహిస్తున్నాం.

– ఫిబ్రవరి 14న తిరుమల‌ ధర్మగిరి వేద పాఠశాల‌లో మాఘ భానుపూజ శాస్త్రోక్తంగా నిర్వహించాం.

– ఫిబ్రవరి 15న తిరుపతి ధ్యానారామంలో కుంద చతుర్థి (పరమశివుడికి మల్లెపూల‌తో అభిషేకం) జరిగింది.

– భారతీయ సనాతన ధర్మ ఔన్నత్యాన్ని నేటి యువతకు తెలియజేసి సమాజం మంచి మార్గంలో పయనించేలా చేయాల‌నే ఉద్దేశంతో వసంత పంచమి సందర్భంగా ఫిబ్రవరి 16న నెల్లూరులో సరస్వతి పూజ వైభవంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థు పాల్గొన్నారు.

– ఫిబ్రవరి 23న తిరుమల‌లో భీష్మ ఏకాదశి సందర్భంగా విష్ణుసహస్రనామ పారాయణం, సుందరకాండ పఠనం జరిగాయి.

– ఫిబ్రవరి 27న మాఘపూర్ణిమను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమల‌యప్పస్వామివారికి స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించాం. వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.

– మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తాం.

శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

– మార్చి 24 నుండి 28వ తేదీ వరకు తిరుమల‌లో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగనున్నాయి.

గుడికో గోమాత

– గుడికో గోమాత కార్యక్రమానికి దేశవ్యాప్తంగా వస్తున్న స్పందన వ‌ల్ల‌ గోవును జాతీయ ప్రాణి(జంతువు)గా ప్రకటించాని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల‌ని తీర్మానించాం.

టిటిడి స్థానికాల‌యాల్లో బ్రహ్మోత్సవాలు

– శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.

– తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆల‌యంలో మార్చి 4 నుండి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తున్నాం.

– తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ‌హిస్తాం.

తిరుచానూరులో తులాభారం

– తిరుమల‌ శ్రీవారి ఆల‌యం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో త్వ‌ర‌లో తులాభారం ప్రవేశపెడ‌తాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.