PHULE REMAINED IDEAL TO MANY REFORMERS-JEO_ సంఘ సంస్కర్తలకు ఆదర్శనీయులు మహాత్మా జ్యోతిబాఫూలే : టిటిడి జేఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 11 Apr, 2019 At 01:15 PM | Categorized As General News

Tirupati, 11 Apr. 19: Mahatma Jyotirao Govindrao Phule remained as a role model to many other social reformers in the country, said, Tirupati JEO Sri B Lakshmikantham.

In his address as a chief guest during the 192 Jayanthi of Jyoti Rao Phule which was observed in the conference hall of TTD administrative building on Thursday, he said, Phule was an Indian social activist, a thinker, social reformer, women empowerment emancipator. His work extended to many fields including eradication of untouchability and the caste system. He remained as a visionary to many leaders, he added.

Govindaiah, Asst. professor of Archaeology department of SV University who was the chief speaker for the occasion elaborated on the life of Phule and how he struggled to achieve his mission of equality.

Welfare Department DyEO Smt Snehalatha was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సంఘ సంస్కర్తలకు ఆదర్శనీయులు మహాత్మా జ్యోతిబాఫూలే : టిటిడి జేఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 ఏప్రిల్‌ 11: మహాత్మా జ్యోతిబాఫూలే ఎందరో సంఘ సంస్కర్తలకు ఆదర్శనీయులుగా నిలిచారని టిటిడి తిరుపతి జేఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం ఉద్ఘాటించారు. మహాత్మా జ్యోతిబాఫూలే 192వ జయంతిని గురువారం టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో, ఇతర అధికారులు ఫూలే చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జ్యోతిబాఫూలే సామాజిక పోరాట యోధుడని, గొప్ప ఆలోచనాపరుడని, సాంఘిక సంస్కరణలకు నాంది పలికారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని తెలిపారు. అణగారిన వర్గాల సమున్నతి కోసం విద్యే సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు. వెనుకబడిన వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారని చెప్పారు.

అనంతరం ముఖ్య వక్తగా విచ్చేసిన ఎస్వియు అర్కియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీ గోవిందయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాఫూలే జీవిత విశేషాలను వివరించారు. సత్యమేవ జయతే అనే నినాదంతో ఫూలే జీవితం సాగిందన్నారు. వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేశారని తెలిపారు. అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత, ఇతర అధికారులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v