PLAN TO CONDUCT SUBHAPRADAM IN OVERSEAS TOO-JEO_ ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమాన్ని ప్రారంభించిన – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 15 Mar. 19: To provide moral education apart from regular academics, TTD will contemplate conducting Subhapradham, the summer training camp for children in overseas too, said, Tirupati JEO Sri B Lakshmikantham.

While answering a NRI devotee Sri Satyanarayana from Dallas of America who suggested JEO to train the NRI youth also in Hindu Sanatana Dharma during the maiden phone in programme, “Bhaktulato Bhavadeeyudu” which was held in his chamber in TTD Administrative Building in Tirupati on Friday, the JEO said, the suggestion is well taken as Youth is the trustee of Prosperity. We will negotiate and let you know soon”, he maintained.

Another pilgrim caller, Sri Naveen Kumar Reddy brought to the notice of JEO about the non allocation of the dormitories in the newly constructed TTD Rest House at Penchalakona and at Tiruchanoor. He also sought JEO about the status of enquiry on missing crowns at Sri Govinda Raja Swamy temple in Tirupati, for which the JEO replied, the rest house will soon be opened both at Pechalakona and in Tiruchanoor. While the police are carrying out full fledged enquiry leaving no stone unturned sending their teams to various areas. Recently we have placed RFID sensors in Sri Govinda Raja Swamy temple which provides double security check to the jewels. We have also started “Sada Samarpana” register in all local temples for proper accounting and verification of jewels”, he answered.

Another caller Sri Jagannadha Reddy from Tirupati sought JEO to revive pujas to UmaBrihadeeshwara statue located at Alipiri besides replica temple of Lord Venkateswara. While Sri Sai Kishore suggested JEO to improve soft skills among TTD security and employees while dealing with pilgrims. Responding to these callers, the JEO said, the staff will be given training in SVETA on communication skills. He also said, the puja will be revived to the structure of Uma Brihadeeshwara located near Alipiri.

Renowned playback singer Sri Mano from Chennai, Callers from Vijayawada Sri Siddhartha, Sri Ashwin Kumar and Sri Nagabhushanam wished JEO that all the sectors like Dharma Pracharam, educational institutions, hospitals of TTD thrive under his supervision.

Retired employees of TTD Sri Chengal Reddy and Sri Venkateswarulu sought JEO to protect TTD properties and house sites from illegal encroachment to which JEO assured the issue will be taken care of.

Smt Gayatri from Tirupati brought to the notice of JEO about the ruthless parking charges in Tiruchanoor to which he replied that at present parking area is under the purview of Panchayat department. “The master plan is on chords. Very soon the parking problem too will be sorted out”, he maintained.

The first of its kind of phone in programme witnessed 14 callers from across the globe giving their suggestions towards the improvement of TTD rest houses and sub-temples in Tirupati.

CE Sri Chandra Sekhar Reddy, SE Sri Ramesh Reddy, SE Electrical Sri Venkateswarulu, Deputy EOs of various temples, reception wing, AVSOs and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

”భక్తులతో భవదీయుడు” కార్యక్రమాన్ని ప్రారంభించిన – టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 మార్చి 15: దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై సూచనలు, సలహాలు అందించేందుకు రూపొందించిన ”భక్తులతో భవదీయుడు” నూతన కార్యక్రమాన్ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం శుక్రవారం ఉదయం ప్రారంభించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

అమెరికాలోని డల్లాస్‌ నగరంకు చెందిన ఎన్‌ఆర్‌ఐ శ్రీ సత్యనారాయణ ”అమెరికాలో టిటిడి నిర్వహించిన వైెభవోత్సవాలు, శ్రీవారి కల్యాణోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ప్రవాస యువతలో ఆధ్యాత్మికత పెంచేందుకు శుభప్రధం వంటి కార్యక్రమాలను అమెరికాలో నిర్వహించాలని కోరారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పారాయణం ఎస్వీబిసిలో ప్రత్యక్ష ప్రసారం” అందించాలని కోరారు.

దీనిపై జెఈవో మాట్లాడుతూ అమెరికాలో ధార్మిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేద పారాయణం ప్రత్యక్ష ప్రసారంపై ఆగమ సలహాదారుతో చర్చిస్తామన్నారు.

తిరుపతికి చెందిన శ్రీ నవీన్‌కుమార్‌ రెడ్డి ”టిటిడి పంచాంగం క్యాలెండరు కొరకు దేశవిదేశాలలోని భక్తులు ఎదురుచూస్తున్నారు. దీనిని భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో టిటిడి నిర్మించిన డార్మీటరీ, 40 గదులు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఇటీవల తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగిన బంగారు కిరీటాల కేసుపై త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయంను ఏ.పి.టూరిజం వారికి కేటాయించాలని టిటిడి నిర్ణయించినట్లు పత్రికలలో వచ్చింది. దీనిని టిటిడి నిర్వహించడం వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యాలు” అందించవచ్చని సూచించారు.

జెఈవో స్పందిస్తు త్వరలో భక్తులకు టిటిడి పంచాంగం క్యాలెండరు అందుబాటులోకి తీసుకువస్తాం. పెంచలకోనలో టిటిడి నిర్మించిన వసతి గృహాన్ని త్వరిత గతిన భక్తులకు అందుబాటులోనికి తీసుకువస్తాం. కిరీటాల కేసును పోలీస్‌లు దర్యాప్తు చేసున్నారు. టిటిడి అనుబంధ ఆలయాలలో భద్రాతను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. తిరుచానూరులోని పద్మావతి నిలయం అంశం ఈవో గారితో చర్చిస్తామన్నారు.

విజయవాడకు చెందిన శ్రీ నాగభూషణం ”దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలలో టిటిడి ఆధ్వర్యంలో విద్యా, వైద్య సేవలను” ఏర్పాటు చేయాలని కోరారు.

దీనిపై జెఈవో మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలలో దివ్వక్షేత్రాలు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా ఇటీవల హైదరాబాదులో శ్రీవారి ఆలయన్ని భక్తులకు అందుబాటులోనికి తీసుకువచ్చాం. ప్రతి జిల్లాలో టిటిడి విద్యా సంస్థలు, వైద్య శాలలు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాన్ని పరిశీలిస్తాం. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలోని వేదపాఠశాలలో వేద విద్యను బోధిస్తున్నాం.

తిరుపతికి చెందిన శ్రీ జ్ఞానప్రకాష్‌ ”తిరుపతిలోని విష్ణునివాసం వసతి సమూదాయానికి ఐఎస్‌వో గుర్తింపు అందుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. నంతరం దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులకు వారివారి బాషలలో సమాచారం తెలిపేందుకు అనువాదంతో కూడిన సాఫ్ట్‌వేెర్‌ను అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని కోరారు.

జెఈవో మాట్లాడుతూ దేశ విదేశాల నుండి విచ్చేసే భక్తులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. వారికి అవసరమైన సమాచారంను ఐవోటి (ఇంటర్నెట్‌ అఫ్‌ థింగ్స్‌) మరియు ఐటి ద్వారా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నెల మూడో శుక్రవారం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు టిటిడి అనుబంధ ఆలయాలు, ధార్మిక కార్యక్రమాలపై భక్తుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన భక్తులు తమ సలహాలు , సూచనలు అందించారన్నారు.

టిటిడి విద్యా సంస్థలలోని విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యంతో కూడిన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తిరుచానూరు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు. యాత్రలో భాగంగా గోవిందనామంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దర్శనంతో ప్రారంభమై తిరుమలలో శ్రీ వరాహాస్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శిస్తేనే యాత్ర సంపూర్ణం అవుతుందన్నారు. అనంతరం భక్తులు టిటిడి అనుబంధ ఆలయాలైన శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నారాయణవనం, నాగలాపురం ఆలయాలను దర్శించుకోవాలని కోరారు.

తిరుచానూరులోని ఫ్రైడే గార్డెన్స్‌లో పద్మావతి పరిణయం, శ్రీనివాస కల్యాణం వృత్తాంతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి పుష్కరిణిలో 20 నిమిషాలపాటు లేజర్‌ షో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

టిటిడి అనుబంధ ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బ్రహ్మత్సవాలలోపు వేగంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు అవసరమైన సమాచారం మరింత వేగవంతంగా అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామావారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాములువారి కల్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ రమేష్‌రెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ సుబ్రమణ్యం, శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ శ్రీధర్‌, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీ ధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.