POLIO IMMUNIZATION AWARENESS RALLY HELD_ తిరుమలలో పల్స్‌పోలియో అవగాహనా ర్యాలీ
By TTD News On 9 Mar, 2019 At 05:22 PM | Categorized As General News

Tirumala, 9 March 2019: In connection with the National Programme of pulse Polio immunization which will be observed on Sunday, an awareness rally was taken out In Tirumala on Saturday.

This is the 25 th pulse polio drops adminatration programme in the 24th year by Government of India. Aswini Hospital Medical Superintendent Dr Narmada along with Dr Kusuma Kumari commenced the rally from SV High School.

The children also took active part in rally covering all streets and residential colonies in Tirumala sensitizing pilgrims and locals.

The pulse polio drops will be administered to the infants and children below 5years of age on Sunday which commences by 7am. TTD has set up 25 polio drops centres out of which 18 are for pilgrims with 2 centres in footpath route and 7 for locals.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో పల్స్‌పోలియో అవగాహనా ర్యాలీ

మార్చి 09, తిరుమల 2019; మార్చి 10 తేదీన ఆదివారంనాడు నిర్వహించనున్న 25వ విడత పల్స్‌పోలియో కార్యక్రమానికి సంబంధించిన తిరుమలలో శనివారంనాడు టిటిడి ఆధ్వర్యంలో అశ్విని ఆసుపత్రి సివిల్‌ సర్జనమెడికల్ సూపరింటెండెంట్ డా|| ఏ.బి. నర్మద మరియు డా|| కుసుమకుమారి నేతృత్వంలో యస్‌.వి. హైస్కూల్‌ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

సుమారు 100 మంది తిరుమల యస్‌.వి హైస్కూల్‌ విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ స్థానికంగా పలు నివాస ప్రదేశాలలో పర్యటించింది. ”మన పిల్లలకు పోలియో చుక్కలు వేయిద్దాం – పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అని విద్యార్థులు చేసిన నినాదంతో తిరుమల నివాస ప్రదేశాలు మారుమ్రోగాయి. ఈ ర్యాలీలో అశ్విని అసుపత్రి సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

కాగా అశ్విని ఆసుపత్రి నేతృత్వంలో తిరుమలలోని 25 ప్రాంతాల్లో పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాలలో ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు 0-5 ఏళ్ళ లోపు చంటి పిల్లలకు పల్స్‌పోలియో చుక్కలు వేస్తారు. ఈ అవకాశాన్ని భక్తులు మరియు స్థానికులు సద్వినియోగం చేసుకోగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v