KRT PAVITROTSAVAMS POSTERS RELEASED_ శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
By TTD News On 10 Jul, 2017 At 03:55 PM | Categorized As General News

Tirupati, 10 July 2017: The Posters of Pavitrotsavams in Sri Kodandarama Swamy temple are released by Tirupati JEO Sri P Bhaskar in TTD Administrative building in Tirupati on Monday.

The three day sin-free festival will be observed from July 19-21 with Ankurarpanam on July 18.

On first day Pavitra Pratistha, second day Pavitra Samarpana and on last day Purnahuti will be performed.

Temple DyEO Smt Munilakshmi, Temple Inspector Sri Sesha Reddy were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

తిరుపతి, 2017 జూలై 10: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను సోమవారం ఉదయం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీ కోదండరామాలయంలో జూలై 19 నుండి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నట్టు తెలిపారు. ఇందుకోసం జూలై 18న సాయంత్రం అంకురార్పణం జరుగనుందని చెప్పారు. ఆలయంలో భక్తుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక జరిగిన దోషాల నివారణ కోసం, ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.

కాగా, పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. గ హస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గ హస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am