PRIVILEGE DARSHAN FOR SENIOR CITIZENS, CHALLENGED AND PARENTS OF 5yr INFANTS ON MARCH 17 AND 18 _ మార్చి 17న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 13 March 2020: With an objective to provide comfortable Srivari darshan to aged, handicapped and parents of infants of five years, TTD organised special darshan for them on any two lean days in a month.

As part of the same commitment, TTD is allotting 4000 tokens for aged and challenged persons on March 17 in three slots (1000 tokens at 10am, 2000 tokens at 2 pm and 1000 tokens at 3 pm slots). TTD appealed that senior citizens and challenged persons should utilise this opportunity instead of their visits on crowded season. Already TTD provided similar darshan to this category of pilgrims on March 10 this month.

Similarly on March 18, TTD organising special darshan for parents with five-year-old infants from morning 9am to 1.30pm through the Supatham entry gate. Similar darshan was provided earlier on March 11 this month.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 17న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 18న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమ‌ల‌, 2020 మార్చి 13: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా మార్చి 17న‌ మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

అదేవిధంగా, మార్చి 18న బుధ‌వారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.