PROPAGATION OF SANATANA HINDU DHARMA OUR TOP PRIORITY -CHAIRMAN _ హిందూ ధర్మ ప్రచారానికి పెద్ద పీట

Tirupati, 17 Dec. 20: As directed by the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy, our priority is to propagate Hindu Sanatana Dharma, said TTD chairman Sri YV Subba Reddy on Thursday.

He participated in the foundation stone laying ceremony for development works worth ₹159.50 lakhs at  Karvetinagaram in the presence of Dy CM Sri A Narayana Swamy.

It also included the construction of a Nirali Mandapam in Skanda Pushkarini costing ₹ 1 crore, CC Road from Sri Venugopal swamy temple to Pushkarini costing ₹42 lakhs,  beautification of Pushkarini at ₹9 lakhs and installation of Borewell and pipelines at ₹8.50 lakhs.

Addressing a meeting later the TTD Chairman said under aegis of HDPP Srivari temples were being built in Weaker sections colonies of both AP and Telangana.

He said TTD is organising Gudiko Gomata program all over the country and already launched in AP and Karnataka during the holy month of Karthika.

The Chairman also said upon the request of Deputy CM Sri Narayana Swamy funds released for development works in Karvetinagaram temple and for repairs for Kalyana Mandapams.

Deputy CM Sri Narayana Swamy thanked the TTD chairman for merger of two temples of Alathur and Kanigirikonda  with TTD.

Earlier the TTD Chairman offered prayers at Sri Varadaraja Swamy temple Alathur and Sri Venugopal Swamy temple, Karvetinagaram.

Chittoor MP Sri Reddappa,MLAS Sri M S Babu, Sri J Srinivasulu, TTD chief engineer Sri Ramesh Reddy, Spl.Gr.DyEO Smt Varalakshmi, HDPP executive members Sri Penchalaih  and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హిందూ ధర్మ ప్రచారానికి పెద్ద పీట
–  కార్వేటినగరం ఆలయం, కళ్యాణమండపం మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తాం
 –  కార్వేటినగరం లో రూ. 159. 50 లక్షల అభివృద్ధి పనులకు డిప్యూటి సిఎం నారాయణ స్వామితో కలసి శంఖుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి, 17 డిసెంబరు 2020: ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో టీటీడీ ద్వారా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. గురువారం మధ్యాహ్నం డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామితో కలసి కార్వేటినగరంలో రూ. 159.50 లక్షలతో స్కంద పుష్కరిణిలో రూ కోటి తో నీరాలి మండపం నిర్మాణం, రూ 42 లక్షలతో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి పుష్కరిణి వరకూ సిసి రోడ్డు నిర్మాణం,  రూ 9 లక్షలతో  పుష్కరిణి సుందరీకరణ, రూ 8.50 పుష్కరిణి కి బోరు, పైప్ లైన్ నిర్మాణాలకు చైర్మన్ శంఖుస్థాపన చేశారు.
అనంతరం జరిగిన సభలో చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలోని దళిత, బలహీన వర్గాల కాలనీల్లో శ్రీవారి దేవాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దీంతో పాటు గుడికో గోమాత పేరుతో దేశ వ్యాప్తంగా ఆలయాలకు గోవు, దూడ దానం చేసే కార్యక్రమం ప్రారంభించామన్నారు. పవిత్ర కార్తీక మాసంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి కూడా గోవును ఇస్తామని చైర్మన్ చెప్పారు. డిప్యూటి సి ఎం శ్రీ నారాయణ స్వామి కోరిక మేరకు కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, కళ్యాణ మండపం మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు శ్రీ సుబ్బారెడ్డి ప్రకటించారు. శంఖుస్థాపన చేసిన పనులు త్వరలోనే పూర్తి చేసి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డిప్యూటి సిఎం శ్రీ నారాయణ స్వామి మాట్లాడుతూ, తన కోరిక మేరకు ఆలత్తూరు శ్రీ వరద రాజ స్వామి ఆలయం, కనిగిరి కొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ లో విలీనం చేసిన చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల లో తనకు అవమానం జరిగింది మాజీ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపులను ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. భక్తాగ్రేసరుడు శ్రీ సుబ్బారెడ్డి ని టీటీడీ చైర్మన్ గా నియమించడం ఆనంద కరన్నారు.
      శ్రీ వైవిసుబ్బారెడ్డి కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం, ఆలత్తూరు శ్రీ వరదరాజు స్వామి ఆలయం, కలికిరి కొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఘన స్వాగతం లభించింది.
ఎంపి శ్రీ రెడ్డెప్ప, శాసన సభ్యులు శ్రీ ఆదిమూలం, శ్రీ జంగాల పల్లి శ్రీనివాసులు, టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటి ఈఓ శ్రీమతి వరలక్ష్మి,  హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సభ్యులు శ్రీ పెంచలయ్య ,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ కృష్ణ యాదవ్, శ్రీ విజయానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.