PUJA PERFORMED TO PADMANABHA NILAYAM_ భ‌క్తుల‌కు అందుబాటులోకి ప‌ద్మ‌నాభ నిల‌యం
By TTD News On 11 Jul, 2019 At 04:03 PM | Categorized As General News

Tirumala, 11 Jul. 19: The old seva sadan complex renamed as Padmanabha Nilayam located inside RTC Bus stand in Tirumala is opened to pilgrims for allocation of lockers on Thursday with the performance of puja.

The massive building has 816 lockers and 70 toilets and bathrooms. Benagaluru based Sri Vinay-a pilot and Sri Anush a B.Tech student received the first allotment of the lockers after the building is thrown open to the utility of pilgrims.

SE 2 Sri Ramachandra Reddy, Special Grade Deputy EO Reception Smt Parvathi, FMS EE Sri Mallikarjuna Prasad, AEO Reception Sri AVL Narayana and other officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భ‌క్తుల‌కు అందుబాటులోకి ప‌ద్మ‌నాభ నిల‌యం

తిరుమల, 2019 జూలై 11: తిరుమ‌ల‌లోని ఆర్‌టిసి బ‌స్టాండ్ వ‌ద్ద నూత‌న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయ‌మైన ప‌ద్మ‌నాభ నిల‌యంను గురువారం నుండి భక్తులకు కేటాయించేందుకు టిటిడి అందుబాటులోకి తీసుకొచ్చింది. రిసెప్ష‌న్‌-2 ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి కె.పార్వ‌తి, ఎస్ఇ -2 రామ‌చంద్ర‌రెడ్డి ఈ మేర‌కు పూజ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు కేటాయించారు.

ఇదివ‌ర‌కు ఈ స‌ముదాయంలో శ్రీ‌వారి సేవాస‌ద‌న్ కార్యాల‌యం నిర్వ‌హించేవారు. ఇటీవ‌ల శ్రీ‌వారి సేవ‌కుల‌కు క‌ల్యాణ‌వేదిక వెనుక వైపు నూత‌న శ్రీ‌వారిసేవా స‌ద‌న్‌ను ప్రారంభించిన విష‌యం విదిత‌మే. ఇందులో భాగంగా ప‌ద్మ‌నాభ నిల‌యంలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారుల స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో 3 విశాల‌మైన హాళ్లు ఉన్నాయి. దాదాపు 816 లాక‌ర్లు, బెడ్‌షీట్లు, దిండ్లు, తాగునీరు, ఎల్ఇడి టివిలు, డిస్‌ప్లే బోర్డులు, స్త్రీలు, పురుషుల‌కు వేరువేరుగా 70 మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్ర‌తి రోజు 51 మంది పారిశుద్ద్య సిబ్బంది 3 షిప్టుల‌లో విధులు నిర్వ‌హిస్తారు.

ప‌ద్మ‌నాభ నిల‌యంలో పూజ‌ల అనంత‌రం బెంగుళూరుకు చెందిన శ్రీ విన‌య్‌కు మొద‌టి లాక‌ర్ కేటాయించి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకువ‌చ్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఇఇ శ్రీ మ‌ల్లిఖార్జున ప్ర‌సాద్‌, డెప్యూటీ ఇఇ శ్రీ‌మ‌తి విశాల‌క్షీ, ఏఈవోలు శ్రీ‌నారాయ‌ణ‌, శ్రీ మోహ‌న్ రాజు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v