PUSHPA YAGAM IN NAGULAPURAM ON MAY 24_ నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి పుష్పయాగం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌
By TTD News On 17 May, 2019 At 07:58 PM | Categorized As General News

Tirupati, 17 May 19: The posters related to annual Pushpayagam at Nagulapuram temple were released by TTD Tirupati JEO Sri B Lakshmikantham in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Friday.

The annual Pushpayagam will be observed in Sri Vedavalli Sametha Veda Narayana Swamy temple at Nagulapuram on May 24 with Ankurarpanam on May 23.

This floral festival will take place between 3pm and 5.30pm in the temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి పుష్పయాగం గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌

తిరుపతి, 2019 మే 17: టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో మే 24వ తేదీన జ‌రుగ‌నున్న పుష్పయాగ మహోత్సవం గోడ‌ప‌త్రిక‌ల‌ను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి. లక్ష్మీకాంతం శుక్రవారం ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది.

మే 23వ తేదీ సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం చేప‌డ‌తారు. పుష్పయాగం సందర్భంగా మే 24న ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్ల రసాలతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు.

అనంతరం రాత్రి 7.00 గంటల వరకు శ్రీ వేదనారాయణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నుండి 27 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ ఈ.సి శ్రీధర్, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v