PUSHPAYGAM SIGNIFIES REMEDIAL RITUAL_ వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం
By TTD News On 22 Apr, 2019 At 09:09 PM | Categorized As Brahmotsavams, Temple News

Vontimitta, 22 Apr. 19: The floral fete Pushpa yagam was performed with celestial fervour at Sri Kodanda Rama Swamy temple in Vontimitta of Kadapa district on Monday evening.

The processional deities of Sita, Rama and Lakshmana were seated on a special platform and the floral ritual pushpa yagam was observed with over 5tonnes of different varieties of traditional and aromatic flowers and leaves.

This fete was carried out between 5pm and 9pm in the temple amidst the chanting of vedic mantras by temple priests.

This ritual is usually performed after brahmotsavams as a “Remedial Festival” to the omissions and commissions performed by religious, non-religious staffs, devotees either knowingly or unknowingly during annual brahmotsavams which were observed from April 13 till April 21. Hence this festival in Agama language is also known as “Pariharotsavam “.

Devotees who thronged to witness the grand fete in the temple were enthralled to witness the grace and grandeur of deities during Pushpayagam.

Temple DyEO Sri Natesh Babu, Garden Deputy Director Sri Srinivasulu, AEO Sri Rama Raju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని పుష్పయాగం

ఒంటిమిట్ట, 2019 ఏప్రిల్‌  22: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 

పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన చేపట్టారు.

కాగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 9.00 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. ఇందులో తులసీదళాలు, మల్లెలు, మల్లియలు, రోజా, చామంతి, గన్నేరు, నూరువరహాలు, సంపంగి, మానసంపంగి, మొగళి దళం తదితర పుష్పాలు, పత్రాలతో స్వామి, అమ్మవారికి పుష్పనీరాజనం సమర్పించారు.   

ప్రకృతి వైపరీత్యాల నుంచి భక్తులను కాపాడాలని స్వామివారిని ప్రార్థిస్తూ భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవైష్ణవాలయాలలో పుష్పయాగం నిర్వహిస్తారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ నటేష్ బాబు, ఏఈవో శ్రీ రామరాజు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. 

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v