RAMAA SAMETA VISHNU POOJA HELD _ వ‌సంత మండ‌పంలో శ్రీ రమా సమేత విష్ణుపూజ

Tirumala, 25 Nov. 20: As part of Karthika Masa Deeksha mulled at Vasanta Mandapam in Tirumala, on the advent of Prabodhana Ekadasi on Wednesday, Sri Ramaa Sameta Vishnu Pooja was performed with religious fervour.

Sri Malayappa Swamy flanked by Sridevi and Bhudevi visited the mandapam and the pooja was performed between 8:30am and 9:30am.

According to Agama Advisor Sri Mohana Rangacharyulu, Goddess Sri Ramaa Devi will be worshipped on this day to aquire prosperity.

In the evening, between 7:15pm and 7:45pm, Sri Maruti will deliver religious discourse on Karthika Puranam-Vishnu Vaibhavam at Nada Neerajana Mandapam.

Among the religious staff Agama Advisor Sri NAK Sundaravaradan, Chief Priest Sri Venugopala Deekshitulu; Sri Krishnaseshachala Deekshitulu performed the kainkaryams.

MP Sri Vemireddi Prabhakar Reddy, Board member Smt Prasanthi Reddy, Additional EO Sri AV Dharma Reddy, SVBC CEO Sri Suresh Kumar took part in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వ‌సంత మండ‌పంలో శ్రీ రమా సమేత విష్ణుపూజ
తిరుమల‌, 2020 నవంబరు 25: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో ప్రబోధనైకాదశి – శ్రీ రమా సమేత విష్ణుపూజ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.
ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ ఈరోజు ప్రబోధనైకాదశి అని, ఈ విశిష్టమైన రోజున శ్రీ రమాదేవి అమ్మవారిని పూజిస్తే పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నారు. అశ్వమేథ యాగం చేసిన ఫలం దక్కుతుందని తెలిపారు. మహిళలకు సత్సంతానం కలుగుతుందని, దీర్ఘసుమంగళులుగా ఉంటారని వివరించారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ రమాదేవి అమ్మవారికి తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
అదేవిధంగా, రాత్రి … 7.15 నుంచి 7.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై  డా.మారుతి ‘కార్తీక పురాణం – విష్ణువైభవం’ పారాయణం చేయనున్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు, ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.