RENOVATION OF KALYANA MANDAPAMS IN OFFING-TIRUPATI JEO_ ద‌శ‌ల‌వారీగా టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల అభివృద్ధి : భక్తులతో భవదీయుడు కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 17 May, 2019 At 11:40 AM | Categorized As General News

Tirupati, 17 May 19: The TTD Kalyana Mandapams will get a new look in a phased manner across the country soon, said, Tirupati JEO Sri B Lakshmikantham.

Answering the live in programme during “Bhaktulato Bhavadeeyudu” in his chambers in TTD administrative building in Tirupati on Friday, the JEO reacting to the query of Smt Hamsaveni, a devotee from Tirupati, who sought JEO to renovate and provide air-conditioning to Srinivasa and Padmavathi Kalyana Mandapams of TTD in Tirupati, to which the JEO said, it is already under process.

Another caller Sri Subba Rao from Nellore sought JEO to develop TTD Kalyana Mandapam in Nellore by personally visiting the place, to which JEO answered the problems if any will be addressed soon. He also said, on a pilot project TTD has taken up the renovation of five kalyana mandapams and soon all of them will be done in a phased manner.

A devotees Sri Narayana from Tirupati suggested JEO to allow direct entrance to the senior citizens who have crossed 75years of age in all local temples in Tirupati to which the JEO replied the suggestion is well taken and the management will look in to the feasibility of implementing it.

Smt Sukanya from Bengaluru brought to the notice of JEO the nonchalant attitude of staff in Srinivasam Rest House in Tirupati and not giving proper information to pilgrims to which the officer said they will be trained in communication skills and behavioural attitude by the concerned Head of the Department.

Sri Seshu Babu from Hyderabad complimented the JEO for making arrangements in providing hassle free darshan to 4.39 pilgrims from May 11 to 15 to which the JEO answered him that was possible with the team work put up by all departments in Tirumala.

CE Sri Chandrasekhar Reddy, SEs Sri Ramesh Reddy, Sri Sriramulu, Sri Venkateswarulu and other officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ద‌శ‌ల‌వారీగా టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల అభివృద్ధి : భక్తులతో భవదీయుడు కార్య‌క్ర‌మంలో జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 మే 17: దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో గ‌ల టిటిడి క‌ల్యాణ‌మండ‌పాల‌ను ద‌శ‌ల‌వారీగా అన్ని సౌక‌ర్యాల‌తో అభివృద్ధి చేస్తామ‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం భక్తులతో భవదీయుడు ఫోన్ ఇన్ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా తిరుప‌తికి చెందిన హంస‌వేణి, నెల్లూరుకు చెందిన సుబ్బారావు అనే భ‌క్తులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిస్తూ మొద‌టి ద‌శ‌లో 5 క‌ల్యాణ‌మండ‌పాల‌కు ఐఎస్‌వో గుర్తింపు ల‌భించింద‌ని, మిగ‌తా వాటిని కూడా ఐఎస్‌వో ప్ర‌మాణాల‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తామ‌న్నారు. తిరుప‌తిలోని శ్రీ‌నివాస‌, ప‌ద్మావ‌తి క‌ల్యాణ‌మండ‌పాల స‌ముదాయాల‌కు త్వ‌ర‌లో ఎసి వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. నెల్లూరులోని టిటిడి క‌ల్యాణ మండ‌పాన్ని ప‌రిశీలించి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని వివ‌రించారు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభిషేకం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నామ‌ని, అనివార్య కార‌ణాల వ‌ల్ల రాలేక‌పోతున్నామ‌ని, మ‌రో తేదీకి మార్చుకునే అవ‌కాశం క‌ల్పించాల‌ని తిరుప‌తికి చెందిన రెడ్డెప్ప‌రెడ్డి అనే భ‌క్తుడు కోరారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న‌ టికెట్ల‌ను వాయిదా వేసే అవ‌కాశం లేద‌ని, ఇలాంటి టికెట్ల‌ను క‌రంట్ బుకింగ్‌లో భ‌క్తుల‌కు కేటాయిస్తామ‌ని జెఈవో తెలిపారు.

తిరుమ‌ల త‌ర‌హాలో తిరుప‌తిలోని స్థానికాల‌యాల్లోనూ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని తిరుప‌తికి చెందిన నారాయ‌ణ కోరారు. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌ని జెఈవో స‌మాధాన‌మిచ్చారు.

తిరుప‌తిలోని శ్రీ‌నివాసం వ‌స‌తి స‌ముదాయంలో క‌రంట్ బుకింగ్‌లో స్లాట్ సిస్ట‌మ్‌ను మార్చాల‌ని బెంగ‌ళూరుకు చెందిన సుక‌న్య కోరారు. రెండు రోజుల క్రిత‌మే స్లాట్ సిస్ట‌మ్‌ను మార్చామ‌ని, గ‌దులు పొందిన‌ప్ప‌టి నుండి 24 గంట‌లు స‌మ‌యం ఉంటుంద‌ని జెఈవో తెలియ‌జేశారు.

తిరుమ‌లకు విశేషంగా విచ్చేసిన భ‌క్తులంద‌రికీ మంచి ద‌ర్శ‌నం క‌ల్పించినందుకు ధ‌న్య‌వాదాలు. ఈశాన్య రాష్ట్రాల‌తోపాటు దేశవ్యాప్తంగా శ్రీ‌వారి వైభ‌వాన్ని ప్ర‌చారం చేయండి అని చేయాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన శేషుబాబు కోరారు. దీనిపై జెఈవో మాట్లాడుతూ మే 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు 4.39 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించామ‌ని, అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డం ద్వారా భ‌క్తుల‌కు విశేష సేవ‌లు అందించామ‌ని తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీ‌వారి దివ్య‌క్షేత్రాల నిర్మాణం చేప‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని వివ‌రించారు. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు 10 ఎక‌రాలు లేదా 5 ఎక‌రాల స్థ‌లం కేటాయిస్తే ఆల‌య నిర్మాణం చేప‌డ‌తామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ రాములు, శ్రీ వేంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీమతి ఝాన్సీరాణి, శ్రీ‌మ‌తి ల‌క్ష్మీన‌ర‌స‌మ్మ‌, శ్రీ ఇసి.శ్రీ‌ధ‌ర్‌, శ్రీ రామ్మూర్తిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v