శ్రీకపిలేశ్వరాలయంలో ఫిబ్రవరి 13న మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు
By TTD News On 11 Feb, 2018 At 10:58 AM | Categorized As Press Releases

శ్రీకపిలేశ్వరాలయంలో ఫిబ్రవరి 13న మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు

ఫిబ్రవరి 11, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 13వ తేదీ మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ప్రత్యేకంగా
క్యూలైన్లు, చలువపందిళ్లు ఏర్పాటు చేశారు.

మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుండి 9 గంటల వరకు రథోత్సవము(భోగితేరు), ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 12.00 గంటల వరకు భక్తులకు
సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 14వ తేదీన తెల్లవారుజామున 12.00 నుండి ఉదయం 4.00 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `