SKVST PAVITROTSAVAMS COMMENCES _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

Srinivasa Mangapuram, 11 Nov. 20: The annual three day Pavitrotsavams in the temple of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram commenced on Wednesday.

On first day Pavitra Mala Pratistha ceremony was performed.

Earlier during the day Snapana Tirumanjanam was performed to Utsava Murthies.

Deputy EO Smt Shanti, AEO Sri Dhananjeyulu, Superintendent Sri Chengalrayalu and priests participated in this fete which was observed in Ekantam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2020 న‌వంబ‌రు  11: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధ‌వారం ప్రారంభమయ్యాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. ఆ త‌రువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం ఆస్థానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ ధనంజయులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చక బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.