SOME RESOLUTIONS DURING BOARD MEETING_ టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
By TTD News On 5 Jun, 2018 At 06:11 PM | Categorized As Board News

Tirumala, 5 June 2018: The TTD Board has made some important resolutions during its board Meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday under the Chairmanship of Sri P Sudhakar Yadav.

* Estimated expenditure to construct Sri Venkateswara Swamy temples in Dalitwadas, Girijanawadas, and Fisherman communities is enhanced from Rs.8 Lakhs to Rs.10Lakhs.

* Vedapathashala to commence in Nagalapuram temple and to take up continuous Veda Parayanam.

* To set up Sri Balaji Veda Pariposhana Trust in SV Vedic University. TTD will provide all privileges to the donors.

* Rs.4.84cr released to purchase medicines and other surgical equipment in TTD hospitals.

* Green signal to sanction 19.15acres to Science Museum and 50.96acres to …Science City to be set up by Central and State Governments.

* To allot 25 acres of land to TATA Trust Cancer Hospital on lease basis at Rs.1lakh per acre per year for a period of 33years.

* To set up video wall in common command control room at Rs.1.60cr. The work has been allotted to Matrix Securities and Services.

* Board has decided to purchase ghee in tankers in 9:2 ratio which includes purchases from across the nation and from the state of AP respectively to encourage local diary vendors.

* Sanction of amount towards training of priests in Agamas and tradition on June 9 and 10 in Sri Venkateswara Swamy temple at Pittsburgh in USA.

* The board has sent a proposal to the government for the promotion of 29 engineering muzdoors as head muzdoors.

* To transport cell phone and luggage from Srivari Mettu to Tirumala, TTD has outsourced the mechanism to Digital India Pvt.Ltd for a period of three years.

* Like in Dharmagiri Vedapathashala, Rs.3lakhs will be deposited on each Student taking up Vedic course in SV Vedic University.

TTD EO Sri Anil Kumar Singhal, Sri Bonda Umamaheswara Rao, Sri GSS Sivaji, Sri Dokka Jagannadham, Sri Rayapati Sambasiva Rao, Sri Challa Ramachandra Reddy, Sri Potluri Ramesh Babu, Sri Sandra Venkata Veeraiah, Smt Sudha Narayanamurthy, Smt Sapna Munagantiwar, Sri Rudra Raju Padma Raju, Sri Meda Ramakrishna Reddy, Sri Dokka Jagannadham, Ex Officio Members Sri Manmohan Singh, Smt Anuradha, Spl Invitees Sri K Raghavendra Rao, Sri N Sri Krishna, Sri B Ashok Reddy, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, FACAO Sri Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

జూన్‌ 05, తిరుమల 2018: టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

– శ్రీవారి ఆభరణాల ప్రదర్శనకు ఆగమపండితుల సలహాలు తీసుకోవాలని నిర్ణయం.

– ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు న్యాయనిపుణుల సూచనల ప్రకారం న్యాయపరంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం.

– దళితవాడలు, గిరిజనవాడలు, మత్స్యకార కాలనీలు మరియు ఇతర గ్రామాలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాలు, శ్రీరామాలయాలు నిర్మించడానికి అయ్యే అంచనా విలువను రూ.8 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపు.

– చిత్తూరు జిల్లా నాగలాపురంలోని ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వేద పాఠశాల ప్రారంభించి నిరంతరం వేద పఠనం జరపాలని నిర్ణయం.

– 2018-19 సంవత్సరానికి గాను టిటిడి ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్‌ పరికరాలను రూ.4.84 కోట్లతో కొనుగోలు.

– తిరుపతిలోని అలిపిరి చెంత టాటా ట్రస్టు క్యాన్సర్‌ ఆసుపత్రికి (అలిమేలు ఛారిటబుల్‌ ఫౌండేషన్‌) ఒక ఎకరానికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు లీజు ప్రాతిపదికన 25 ఎకరాల స్థలం కేటాయింపు.

– తిరుపతి – చెర్లోపల్లి మార్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేయనున్న సైన్సు మ్యూజియానికి 19.15 ఎకరాలు, సైన్సు సిటికి 50.96 ఎకరాలు కేటాయింపు.

– తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు టిటిడి నిఘా, భద్రతా విభాగం ఆధ్వర్యంలో పాత అన్నప్రసాద భవనంలోని కామన్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ”వీడియోవాల్‌” ఏర్పాటుకు రూ.1.60 కోట్లు మంజూరు. వీడియోవాల్‌ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ”మ్యాట్రిక్స్‌ సెక్యూరిటీస్‌ మరియు సర్వీసెస్‌” వారికి అప్పగింత.

– తిరుమల ధర్మగిరి వేదపాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఏవిధంగానైతే ప్రోత్సాహకంగా రూ.3 లక్షలు వారి పేరిట డిపాజిట్‌ చేస్తున్నామో అదే తరహాలో శ్రీ వేంకటేశ్వర వేద వర్సిటీలో వేదవిద్యను అభ్యసించే విద్యార్థులకు రూ.3 లక్షలు డిపాజిట్‌ చేసేందుకు నిర్ణయం.

– ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శ్రీబాలాజి వేదపరిపోషణ ట్రస్టు ఏర్పాటుకు ఆమోదం. ఈ ట్రస్టుకు విరాళాలు అందించే దాతలకు శ్రీవారి దర్శనం, బస, ఇతర సదుపాయాలను కల్పిస్తారు.

– చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామి సమేత శ్రీ పద్మావతి అమ్మవారికి నిత్య అలంకరణకు పుష్పాల దిట్టానికి ఆమోదించాం.

– ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం ట్యాంకర్ల ద్వారా కొనుగోలుచేసే ఆవునెయ్యికి సంబంధించి 9 : 2 (దేశవ్యాప్తంగా 9, ఆంధ్రప్రదేశ్‌లో 2) నిష్పత్తిలో కొనుగోలుకు నిర్ణయం.

– 29 మంది ఇంజినీరింగ్‌ మజ్దూర్లను హెడ్‌ మజ్దూర్లుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వ ఆమోదం కోసం పంపేందుకు ఆమోదం.

– భక్తుల లగేజి, సెల్‌ఫోన్‌లను తిరుపతి, అలిపిరి, శ్రీవారిమెట్టు నుండి తిరుమలకు తరలించేందుకు అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 3 సంవత్సరాల కాలపరిమితికి డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారికి ఇచ్చేందుకు ఆమోదం.

– అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు ఆగమ సంప్రదాయాలపై శిక్షణ శిబిరం నిర్వహించేందుకు ఆమోదం.

ఈ సమావేశంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవోలు శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, శ్రీపోల భాస్కర్‌, శ్రీ జిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ బోండా ఉమామహేశ్వర్‌రావు, శ్రీ రాయపాటి సాంబశివరావు, శ్రీచల్లా రామచంద్రారెడ్డి, శ్రీ పొట్లూరి రమేష్‌బాబు, శ్రీ సండ్ర వెంకటవీరయ్య, శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీ రుద్రరాజు పద్మరాజు, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీ డొక్కా జగన్నాథం, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ మన్మోహన్‌ సింగ్‌, కమిషనర్‌ శ్రీమతి వైవి.అనూరాధ, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ అశోక్‌రెడ్డి, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am `