SPORTS COMPLEX SOON FOR TTD EMPLOYEES-JEO TIRUPATI_ టిటిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం : తిరుపతి జెఈవో
By TTD News On 25 Apr, 2019 At 06:21 PM | Categorized As General News

Tirupati JEO Sri B Lakshmikantham on Thursday directed the engineering officials to come out with an action to construct a sports complex for the sake of TTD employees in the empty place located in TTD press building area.

The JEO along with officials inspected the place and said, the sports complex should have all the advanced facilities. For men cricket, football, volleyball, lawn tennis, badminton, chess need to be set up while for women kabaddi, carroms, tug of war courts etc.

Later the JEO also inspected TTD call centre to monitor its functioning. He instructed the engineering officials to erect the map of Tirumala at all important places in Tirupati so that the visiting pilgrims will have better information on to where and how to reach their destined place.

Similarly he also instructed them to play display boards pertaining to all local temples in the respective areas.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టిటిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం : తిరుపతి జెఈవో

తిరుపతి, 2019 ఏప్రిల్‌ 25: టిటిడి ఉద్యోగులకు ఉన్నత ప్రమాణాలతో నూతన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించాలని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి ప్రచురణల విభాగం ప్రాంగణంలో ఉన్న స్థలన్ని గురువారం జెఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగులకు అత్యాధునిక సౌకర్యాలతో టిటిడి ప్రచురణల విభాగం ప్రాంగణంలో ఉన్న స్థలంలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో పురుషులు వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, లాన్‌ టెన్నిస్‌, క్యారమ్స్‌, చెస్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, కబడ్డీ, మహిళలు విభాగంలో టగ్‌ ఆఫ్‌ వార్‌, బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్స్‌, చెస్‌, త్రోబాల్‌, డాడ్జిబాల్‌, కబడ్డి ఆటలు ఆడేలా నిర్మించాలన్నారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంప్రక్కన ఉన్న ఎస్వీ మ్యూజియంను పాత హూజురు ఆఫీసులోనికి మార్చెందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

టిటిడి కాల్‌సెంటర్‌ తనిఖీలు:

టిటిడి పరిపాలన భవనంలోని కాల్‌సెంటర్‌ ద్వారా భక్తులకు వేగంగా సులభంగా సిబ్బంది సమాచారం అందించేందుకు ఏర్పాటు చేసిన సమాచార బోర్డులను తిరుపతి జెఈవో, అధికారులతో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ కాల్‌సెంటర్‌ లో టిటిడి అనుబంధ ఆలయాల సమాచారం, ఆర్జిత సేవల వివరాలు, దర్శన సమయం తదితర అంశాలతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమలకు సంబంధించిన మ్యాప్‌ను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు తిరుమలలో ఎక్కడ ఉన్నా వారికి త్వరితగతిన సమాచారం అందించేలా మ్యాప్‌లు రూపొందించాలని సూచించారు. రైళ్లు, విమాన, ముఖ్యమైన ప్రాంతాలకు బస్సుల రాకపోకల సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాల్‌సెంటర్‌లో ఇంజినీరింగ్‌ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ -1 శ్రీ రమేష్‌రెడ్డి, ఇతర అదికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v