SRAVANAM – A BOON TO DEAF AND DUMB CHILDREN-JEO_ వినికిడిలోపం ఉన్న చిన్నారులకు కల్పతరువు శ్రవణం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 8 Mar, 2019 At 06:10 PM | Categorized As General News

Tirupati, 8 Mar. 19: The Srvavanam project established by TTD is a boon to infants and children who are suffering from hear and speech impairedness, said Tirupati JEO Sri B Lakshmikantham.

The JEO took part in the 13th Anniversary of the Sravanam in Tirupati on Friday. Speaking on this occasion, he said, started with a noble aim by TTD in 2006, so far 313 kids who underwent training and medi care in Sravanam are now leading a normal life like others. I congratulate all the faculty for this. A sub branch was also opened in Visakhapatnam in 2012 to spread the services to more needy”, he added.

The cultural programmes by these special students enthralled everyone on the occasion.

DyEO Smt Bharathi, AEO Smt Tamaraselvi, Superintendent Sri Mohan, faculty, students were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వినికిడిలోపం ఉన్న చిన్నారులకు కల్పతరువు శ్రవణం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

మార్చి 08, తిరుపతి, 2019: వినికిడిలోపం ఉన్న చిన్నారులకు కల్పతరువు శ్రవణం ప్రాజెక్ట్‌ అని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని శ్రవణం ప్రాజెక్ట్‌ 13వ వార్షికోత్సవం శుక్రవారం పాత మెటర్నిటి ఆసుపత్రి ఆవరణలోని శ్రవణం కేంద్రంలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జెఈవో మాట్లాడుతూ సేవకు పరమావధి టిటిడి అని, అవసరమైన వారికి సేవ చేయడంలో ముందు వరుసలో ఉంటామని తెలిపారు. పుట్టుకతో వినికిడిలోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి తగిన వినికిడి యంత్రాలు అమర్చి, శిక్షణ ఇచ్చి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు శ్రవణం సంస్థ కృషి చేస్తోందన్నారు. డిసెంబర్‌ 15, 2006లో స్థాపించబడిన ఈ సంస్థ 2008 ఏడాది నుండి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 313 మంది పిల్లలకు శిక్షణ ఇచ్చి సాధారణ పాఠశాలలో చేర్పించారని అన్నారు. శ్రవణం సంస్థను అన్ని జిల్లాలలోనూ విస్తరింపచేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో జూన్‌ 1, 2012న విశాఖపట్ణణంలో ఉపకేంద్రాన్ని ప్రారంభించారన్నారు. శ్రవణం సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిని జెఈవో అభినందించారు.

ముందుగా అర్చకులు ప్రార్థన చేశారు. వార్షిక నివేదికను డిప్యూటీ ఈవో శ్రీమతి కె.భారతి నివేదించారు. చిన్నారులు నేర్చుకున్న పద్యాలు, పాటలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శ్రవణం సంస్థ ఇచ్చిన శిక్షణ మూలంగా తమ పిల్లలు వినికిడి లోపం నుండి సాధారణ స్థితికి వచ్చారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభ కనపరచిన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీమతి సెల్వి, సూపరింటెండెంట్‌ శ్రీ మోహన్‌, శ్రవణం ఉపాధ్యాయురాలు శ్రీమతి కె.వి.సుధ, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v