LIST OF EVENTS IN THE MONTH OF AUGUST IN SRI GT_ ఆగస్టులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
By TTD News On 29 Jul, 2017 At 04:46 PM | Categorized As Events, Press Releases

Tirupati, 29 July 2017: There are series of religious event which are to take place in the month of August in the famous ancient temple of Lord Sri Govinda Raja Swamy, which happens to be one of the most important sub-shrines under the umbrella of TTD in Tirupati.

>August 4: Procession of Lord Sri Govindaraja Swamy in connection with Tulasi Mahatyam Festival in the morning at 7:30am, Procession of Goddess Andal in connection with Varalakshmi vratam,
> August 7: Sravana Upakarma
> During the Fridays which falls on 11, 18 and 25 there will be procession of Sri Andal Ammavaru along the four mada streets.
> August 15: Gokulastami Astanam
> August 16: Procession of Sri Rukmini Satyabhama sametha Sri Parthasaradhi Swamy in connection with Rohini star
> August 18: Chinnaveedhi Utlotsavam and procession of Sri Govindaraja Swamy and Sri Krishna Swamy
> August 19: Peddaveedhi Utlotsavam and procession of Sri Govindaraja Swamy and Sri Krishna Swamy
> August 24: With the asterism of Uttara, Lord Govinda Raja Swamy accompanied by his two consorts Sridevi and Bhudevi will bless the devotees along the four mada streets by 5.30pm.
> August 31: Ankurarpana to three day annual pavitrotsavams from September 1-3

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆగస్టులో శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

జూలై 29, తిరుపతి 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఆగస్టు 4న తులసి మహత్యం ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా స్వామివారు ఉదయం 7.30 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అదేరోజున వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

– ఆగస్టు 7న పౌర్ణమినాడు శ్రావణ ఉపకర్మ జరుగనుంది.

– ఆగస్టు 11, 18, 25వ తేదీల్లో శుక్రవారంనాడు సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

– ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.

– ఆగస్టు 16న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

– ఆగస్టు 18న చిన్నవీధి ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం 7.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– ఆగస్టు 19న పెద్దవీధి ఉట్లోత్సవాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

– ఆగస్టు 24న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీగోవిందరాజస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.

– ఆగస్టు 31న పవిత్రోత్సవాలకు అంకురార్పణ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am