SRI KALABHAIRAVA HOMAM HELD AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాలభైరవస్వామివారి హోమం

TIRUPATI, 03 DECEMBER 2021: As a part of the month-long annual Karthikamasa Utsavams, Sri Kala Bhairava Swamy Homam was held at Sri Kapileswara Swamy temple in Tirupati on Friday.

Due to Covid restrictions, this Homam was held in Ekantam. In Yagashala, after performing morning pujas, Astabhairava Homam, Maha Purnahuti, Kalasa Udvasana, Mahashanti Abhishekam, Nivendana and Harati were performed.

On December 4, Sri Chandikeswara Swamy Homam will be observed.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddy Sekhar, archakas were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కాలభైరవస్వామివారి హోమం

తిరుపతి, 2021 డిసెంబ‌రు 03: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో హోమ మహోత్సవాల్లో భాగంగా శుక్ర‌వారం శ్రీ కాలభైరవస్వామివారి హోమం ఏకాంతంగా జరిగింది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. డిసెంబ‌రు 4న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.