SRI RAMA PATTABHISEKAM IN SRIVARI TEMPLE _ శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirumala, 22 April 2021: As part of the annual Sri Ramanavami celebrations, the TTD organised a magnificent spectacle of Sri Rama Pattabhisekam at the Srivari temple on Thursday night.

In connection with the fete Vishesha samarpana was conducted for the utsava idols of Sri Sitarama, Lakshmana and Anjaneya followed by Sahasra Deepalankara seva at Vaibhavotsava Mandapam and majestic procession on Mada streets.

Thereafter the spectacular ceremony of Sri Rama Pattabhisekam was performed at the Bangaru Vakili of Srivari temple to the utsava idols and archakas chanted the Pattabhisekam shlokas of Valmiki Ramayana.

The colourful episode concluded with special garlanding of all utsava idols besides Shatari samarpana to Tirumala Pontiffs and officials.

TTD Addl EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Temple Dy EO Sri Harindranath were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం
 ఏప్రిల్ 22, తిరుమల, 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సంద‌ర్భంగా సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు విశేష సమ‌ర్ప‌ణ చేప‌ట్టారు. సాయంత్రం 5 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు వైభ‌వోత్స‌వ మండ‌పంలో స‌హ‌స్ర‌దీపాలంకార‌సేవ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించారు.
రాత్రి 8 నుండి 9 గంటల వ‌ర‌కు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని ప‌ట్టాభిషేక స‌ర్గ పారాయ‌ణం చేశారు. ఆ త‌రువాత స్వామివారికి అక్ష‌తారోప‌ణ‌, నైవేద్యం స‌మ‌ర్పించి హార‌తి ఇచ్చారు. అనంత‌రం సుగ్రీవుడు, అంగ‌దుడు ఉత్స‌వ‌మూర్తుల‌ను వేంచేపు చేసి వారితోపాటు ఆంజ‌నేయ‌స్వామివారికి పుష్ప‌మాల‌లు స‌మ‌ర్పించారు. జీయ్యంగార్ల‌కు, అధికారుల‌కు ప‌రివ‌ట్టం క‌ట్టి శ‌ఠారి స‌మ‌ర్ప‌ణ‌తో ఈ కార్య‌క్ర‌మం ముగిసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.